WTC Final 2023: భారత క్రికెట్ జట్టు 2013 నుంచి ఒక్క ఐసీసీ టోర్నీని గెలవలేదు. ఈ కరువు ఈ సంవత్సరం ముగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC Final 2023)లో ఆస్ట్రేలియాతో (IND vs AUS) టీమిండియా జూన్ 7 నుంచి ఓవల్‌లో తలపడనుంది. టీమిండియా ఈ మ్యాచ్‌ని ఎలాగైనా గెలవాలని కోరుకుంటుంది. ఇందుకోసం ఆటగాళ్లందరూ విపరీతంగా చెమటలు కక్కిస్తున్నారు. అదే సమయంలో ఆటగాళ్ళ మధ్య వినోదం కూడా తారాస్థాయికి చేరుకుంది. రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ కేఎస్ భరత్‌ల వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది.
సోషల్ మీడియాలో టీమిండియా ఫోటోషూట్ సందర్భంగా అశ్విన్, కేఎస్ భరత్‌ల ఫన్నీ వీడియో బయటకు వచ్చింది. వీడియోలో, అశ్విన్ ఫుల్ జోవియల్ మూడ్‌లో కనిపించాడు. భరత్‌ని తనకు తెలుగు భాష నేర్పించమని అడిగినట్లు వీడియోలో చూడొచ్చు. వీడియో ప్రారంభంలో, భరత్ తన సహచరుడు అశ్విన్‌ను స్వాగతించాడు. ఆ తర్వాత భరత్‌ని ఫొటోషూట్ అంటే భయపడుతున్నావా అని అశ్విన్ అడిగాడు. అంతా మంచిగానే ఉందని అనుకుంటున్నావా? అని అడిగాడు. దీనికి భరత్, ‘నేను భయపడడం లేదని, నిజంగా సవాలు కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తెలుగు అభిమానులకు ఒక సందేశాన్ని అందించమని భరత్‌ని కోరాడు.
భరత్ టీమిండియా అభిమానులందరినీ జట్టుకు మద్దతు ఇవ్వాలని కోరాడు. ట్రోఫీని భారతదేశానికి తిరిగి తీసుకువస్తామని చెప్పుకొచ్చాడు. అశ్విన్ తనకు తెలుగులో ఏదైనా నేర్పించమని భరత్‌ని అడిగాడు. ఈ మేరకు భరత్ తెలుగులో కొన్ని వాక్యాలు చెప్పాడు. వాటిని అశ్విన్ పలికాడు.
Andhariki Namaskaram, Ellarukum Vanakkam.
Some Tamil ? Telugu connection from London, as @KonaBharat teaches @ashwinravi99 Telugu
Full video will be out by afternoon. Stay tuned. pic.twitter.com/q5CJKoDnRw
— Mission London: WTC Final ? (@crikipidea) June 5, 2023
WTC రెండవ దశలో రవిచంద్రన్ అశ్విన్ ప్రదర్శన గురించి మాట్లాడితే.. 36 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టోర్నీలో అత్యద్భుతంగా రాణించి అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 19.67 సగటుతో 61 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చాడు. ఫైనల్ మ్యాచ్‌లోనూ అతడి నుంచి బలమైన ప్రదర్శన చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..