Telugu News Sports News Cricket news Team India Pacer Pooja Vastrakar has been ruled out due to an injury before Women's T20 World Cup 2023 with AUSW
Pooja Vastrakar: ప్రపంచకప్ సెమీస్ ముందు భారత్‌కు భారీ షాక్.. గాయంతో టోర్నీ దూరమైన ఆల్‌రౌండర్ పూజా..
ఫిబ్రవరి 23 సాయంత్ర 6:30 గంటలకు టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ కోసం ఆసీస్ జట్టుతో భారత్ తలపడనుంది. అయితే ఈ కీలక పోరుకు సిద్ధమవుతోన్న..
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2023 ‘గ్రూప్ బీ’ టాప్ 2 స్థానాలలో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఈ రోజు సెమీ ఫైనల్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో వియజాలతో సెమీస్‌కు చేరిన టీమిండియాకు ఆ మ్యాచ్ ఆడే ముందు ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు అంటే ఫిబ్రవరి 23 సాయంత్ర 6:30 గంటలకు టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ కోసం ఆసీస్ జట్టుతో భారత్ తలపడనుంది. అయితే ఈ కీలక పోరుకు సిద్ధమవుతోన్న తరుణంలో టీమిండియా ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ నుంచే వైదొలగింది. ఈ మేరకు రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాని ఆమె స్థానంలో తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా చేసింది బీసీసీఐ.
UPDATE ? – Pacer Pooja Vastrakar has been ruled out due to an upper respiratory tract infection!