IND vs NZ: వికెట్ల రారాజు ఖాతాలో మరో రికార్డ్.. వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా..

Mohammed Shami: షమీ 33వ ఓవర్‌లో కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్ చేర్చాడు. న్యూజిలాండ్ కెప్టెన్ డీప్ స్క్వేర్ లెగ్ ఫెన్స్‌ను క్లియర్ చేయడంలో విఫలమై.. వికెట్ సమర్పించుకున్నాడు. షమీ తన 17వ ODI ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లో మైలురాయిని అందుకున్నాడు. టోర్నమెంట్‌లో అంతకుముందు ఈ ఫీట్ సాధించిన ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ 19 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. 33 ఏళ్ల షమీ వన్డే ప్రపంచకప్‌లో 50 వికెట్లు తీసిన ఏడో బౌలర్ కాగా, తొలి భారతీయుడిగా నిలిచాడు.

IND vs NZ: వికెట్ల రారాజు ఖాతాలో మరో రికార్డ్.. వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా..
Ind Vs Nz Cwc 2023 Shami

Updated on: Nov 15, 2023 | 9:46 PM

Mohammed Shami: బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి సెమీఫైనల్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

షమీ 33వ ఓవర్‌లో కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్ చేర్చాడు. న్యూజిలాండ్ కెప్టెన్ డీప్ స్క్వేర్ లెగ్ ఫెన్స్‌ను క్లియర్ చేయడంలో విఫలమై.. వికెట్ సమర్పించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

షమీ తన 17వ ODI ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లో మైలురాయిని అందుకున్నాడు. టోర్నమెంట్‌లో అంతకుముందు ఈ ఫీట్ సాధించిన ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ 19 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.

33 ఏళ్ల షమీ వన్డే ప్రపంచకప్‌లో 50 వికెట్లు తీసిన ఏడో బౌలర్ కాగా, తొలి భారతీయుడిగా నిలిచాడు.

రైట్ ఆర్మ్ పేసర్ మొదట్లో భారత ప్లేయింగ్‌ 11లో భాగం కాదు. అయితే గ్రూప్ దశలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తిరిగి వచ్చినప్పటి నుంచి, వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు.

మహ్మద్ షమీ ODI ప్రపంచ కప్‌లలో భారతదేశం తరపున టాప్ వికెట్ టేకర్‌గా మారాడు. కివీస్, శ్రీలంక జట్లపై రెండు 5 వికెట్లను పడగొట్టాడు.

వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు (ఇన్నింగ్స్)

ఆటగాడు ఎడిషన్లు ఇన్నింగ్స్
మహ్మద్ షమీ (IND) 2015-2023* (3) 17
మిచెల్ స్టార్క్ (AUS) 2015-2023* (3) 19
లసిత్ మలింగ (SL) 2007-2019 (4) 25
గ్లెన్ మెక్‌గ్రాత్ (AUS) 1996-2007 (4) 30
ముత్తయ్య మురళీధరన్ (SL) 1996-2011 (5) 30
వసీం అక్రమ్ (PAK) 1987-2003 (5) 33

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..