T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌‌లో బుమ్రా ఆడేనా.. సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే?

|

Oct 01, 2022 | 5:48 AM

Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్‌ నుంచి తప్పుకోలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌‌లో బుమ్రా ఆడేనా.. సౌరవ్ గంగూలీ ఏమన్నారంటే?
Jasprit Bumrah
Follow us on

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు రిలీఫ్ న్యూస్ వచ్చింది. టీమ్ ఇండియా నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్ నుంచి ఇంకా ఔట్ కాలేదు. ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా సమయం ఉందని, కాబట్టి బుమ్రా ఆడతాడని భావించవచ్చని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు.

సౌరవ్ గంగూలీ ఒక వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ, జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించలేదని, దాని గురించి ఏదైనా చెప్పడం చాలా తొందరే అవుతుందని అన్నారు. టీ20 ప్రపంచకప్‌ నుంచి జస్ప్రీత్ బుమ్రా ఔట్ కావడం లేదని బీసీసీఐ అధ్యక్షుడు తెలిపారు. ఇది ప్రపంచకప్ ప్రారంభానికి సమయం. మనం వేచి ఉండాలి. తొందరపడి ఏది పడితే అది చెప్పకూడదంటూ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

వెన్నునొప్పి కారణంగా జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి వెన్నునొప్పి సమస్య కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్‌లో కూడా పాల్గొనలేకపోయాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి ఎంపికయ్యాడు.

బుమ్రా ఆడడంపై తొలగని సందిగ్ధత..

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కూడా బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు తలెత్తాయి. ఈ సిరీస్‌లోని తొలి టీ20 మ్యాచ్‌లో బుమ్రా ఆడలేకపోయాడు. ఆ తర్వాత బుమ్రా సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు బుమ్రా దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా బుమ్రా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ తాజా సమాచారం అందించింది.

టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా ఆడే పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. బుమ్రా టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లినా పాకిస్థాన్‌తో ఆడగలడా లేదా అనేది ఇంకా తెలియదు. ఒకవేళ బుమ్రా ఆడని పక్షంలో మహ్మద్ షమీ లేదా మహ్మద్ సిరాజ్‌ను టీమ్ ఇండియాలో చేర్చుకోవచ్చని తెలుస్తోంది.

టీ20 ప్రపంచ కప్ 2022కు భారత్ స్క్వాడ్..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.
స్టాండ్‌బై ప్లేయర్స్ : మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.