AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC World Cup: వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఆడేది 12 మ్యాచ్‌లే.!

వన్డే ప్రపంచకప్ కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ శీతాకాలంలో ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్ మజా మరింత హీట్‌ ఎక్కించనుంది. 12 ఏళ్ల తర్వాత...

ICC World Cup: వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఆడేది 12 మ్యాచ్‌లే.!
India Vs Wi Squad
Ravi Kiran
|

Updated on: Jun 28, 2023 | 11:20 AM

Share

వన్డే ప్రపంచకప్ కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ శీతాకాలంలో ఫోర్లు, సిక్సర్లతో క్రికెట్ మజా మరింత హీట్‌ ఎక్కించనుంది. 12 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిధ్యమిస్తోంది భారత్. ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించి అధికారిక షెడ్యూల్‌ను మంగళవారం బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి పోరుతో మొదలై.. నవంబర్ 19న(ఫైనల్‌)తో ఈ వరల్డ్‌కప్ ముగుస్తుంది.

ఇదిలా ఉంటే.. 2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండనుంది. జూలై-ఆగష్టు మధ్య వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు, అలాగే ఆగష్టులో ఐర్లాండ్‌తో 3 టీ20లు ఆడనుంది రోహిత్ సేన. సెప్టెంబర్ ఆసియా కప్ జరగనుండగా.. అదే నెలలో ఆఫ్ఘానిస్తాన్‌తో 3 వన్డేల సిరీస్‌లో టీమిండియా పాల్గొంటుంది. ఇక నెక్స్ట్ అక్టోబర్-నవంబర్‌లో వన్డే ప్రపంచకప్ జరుగుతుంది. కాగా, ఈ వరల్డ్‌కప్ కంటే ముందుగా టీమిండియా సరిగ్గా 12 వన్డే మ్యాచ్‌లు ఆడనుండటం గమనార్హం.