
IND vs PAK: ఆసియా కప్ 2025 ఉత్సాహం మొదలైంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఈ టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించాయి. ఇప్పుడు అందరూ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే కీలక మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ మ్యాచ్‌కు ముందే, భారత ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ ఆసియా కప్ ఛాంపియన్ జట్టును అంచనా వేశాడు. మూడు జట్లు రేసులో ఉన్నప్పటికీ, టీమిండియా ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంటుందని స్పష్టం చెశాడు.
ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు అవకాశాల గురించి ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘ఆసియా కప్ నకు ఎంపికైన ప్రస్తుత భారత జట్టు ఆశాజనకంగా కనిపిస్తోంది. చాలా మంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు అవకాశం వస్తే తమను తాము నిరూపించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. భారత జట్టు ఎటువంటి సందేహం లేకుండా ఆసియా కప్‌ను గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది’ అని అన్నారు.
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే కీలక మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ ఏకపక్షంగా గెలిచింది. 2024 టీ20 ప్రపంచ కప్‌లో కూడా పాకిస్తాన్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈసారి రెండు జట్లు ఎలా రాణిస్తాయో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ పై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిలో 26 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ను బహిష్కరించాలనే డిమాండ్ తీవ్రమైంది. అయితే, బహుళజాతి టోర్నమెంట్ లో పాకిస్తాన్ తో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బిగ్ మ్యాచ్ కు ముందు, బీసీసీఐ కార్యదర్శి దేవ్ జిత్ సైకియా టీమిండియాను అభినందించారు. బహిష్కరణకు సంబంధించి వివరణ కూడా ఇచ్చారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..