On This Day: 17 ఓవర్లలో 42 పరుగులకు ఆలౌట్.. టీమిండియా పతనానికి ఆ బౌలరే కారణం.! ఎవరంటే.?

|

Jun 24, 2021 | 2:39 PM

అడిలైడ్ టెస్ట్‌ను భారత క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోలేరు. టీమిండియా అత్యల్ప టెస్ట్ స్కోర్ ఇక్కడే నమోదైంది. దిగ్గజ బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నా.. కేవలం 36 పరుగులకే..

On This Day: 17 ఓవర్లలో 42 పరుగులకు ఆలౌట్.. టీమిండియా పతనానికి ఆ బౌలరే కారణం.! ఎవరంటే.?
Kohli
Follow us on

అడిలైడ్ టెస్ట్‌ను భారత క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోలేరు. టీమిండియా అత్యల్ప టెస్ట్ స్కోర్ ఇక్కడే నమోదైంది. దిగ్గజ బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నా.. కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇదొక మాయని మచ్చగా మిగిలింది. అయితే దీని కంటే ముందు భారత్ టెస్ట్ క్రికెట్‌ అత్యల్ప స్కోర్ ఎంతో తెలుసా.? అంతకుముందు, ఒక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 42 పరుగులకు ఆలౌట్ అయింది. తగ్గించబడిన ఇబ్బందిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్ ఎప్పుడు జరిగింది.? ఏ జట్టుతో టీం ఇండియాను ఇలాంటి స్కోర్ సాధించింది.? అనేది ఇప్పుడు చూద్దాం..

1974 జూన్ 20-24 మధ్య ఇంగ్లాండ్, భారత్ మధ్య ఓ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది. మొదట బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ 629 పరుగులు చేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక భారత బౌలర్ బిషన్ సింగ్ బేడి ఆరు వికెట్లు పడగొట్టగా, సయ్యద్ అబిద్ అలీ, ఎరపల్లి ప్రసన్న రెండేసి వికెట్లు తీశారు.

క్రిస్ ఓల్డ్ మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు…

ఇదిలా ఉంటే భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, ఓపెనర్ ఫరూక్ అబ్దుల్లా 86 పరుగులు చేయగా, గుండప్ప విశ్వనాథ్ 52 పరుగులు చేశాడు. సునీల్ గవాస్కర్ 49 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ ఓల్డ్ 4 వికెట్లు, మైక్ హెండ్రిక్స్ మూడు వికెట్లు పడగొట్టారు. ఇక ఫాలో-ఆన్ మొదలు పెట్టిన భారత జట్టుకు అనుకోని షాక్ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 17 ఓవర్లకు కేవలం 42 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్‌మెన్‌లో ఏక్నాథ్ సోల్కర్ మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. తొమ్మిది మంది ప్లేయర్స్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్ ఓల్డ్ 5 వికెట్లు పడగొట్టగా, జియోఫ్ ఆర్నాల్డ్ నాలుగు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించారు.

Also Read:

Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!

Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!

సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!