MS Dhoni: ఆన్‌లైన్ వేలంలో వింటేజ్‌ కారు కొనుగోలు చేసిన ధోనీ.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

|

Jan 19, 2022 | 7:10 PM

Land Rover Series 3 Station Wagon: ఇప్పటికే ధోనీ గ్యారేజ్‌లో ఎన్నో అద్భుతమైన కార్లు ఉన్నాయి. అందులో కొత్తవాటితో పాటు పాతవి కూడా దర్శనమిస్తాయి. వెహికిల్స్‌ అంటే మనసుపారేసుకునే ధోనీ.. ప్రస్తుతం ల్యాండ్ రోవర్‌ను ఆన్‌లైన్ వేలంలో ..

MS Dhoni: ఆన్‌లైన్ వేలంలో వింటేజ్‌ కారు కొనుగోలు చేసిన ధోనీ.. ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
Ms Dhoni
Follow us on

MS Dhoni Buys Land Rover Series 3 Station Wagon: ప్రీమియం ప్రీ-ఓన్డ్ వెహికల్ డీలర్‌షిప్, బిగ్ బాయ్ టాయ్జ్ ఇటీవల తన ప్లాట్‌ఫారమ్‌లో పాతకాలపు కార్ల ఆన్‌లైన్ వేలాన్ని ప్రారంభించింది. పాతకాలపు కార్లలో ఒకటైన 1971 ల్యాండ్ రోవర్ సిరీస్ 3 స్టేషన్ వ్యాగన్‌(Land Rover Series 3 Station Wagon)పై మనసు పడిన టీమిండియా మాజీ సారథి, జార్ఖండ్ డైనమేట్ ఎంఎస్ ధోని(MS Dhoni).. తన గ్యారేజీలోకి చేర్చాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ధోనీ గ్యారేజ్‌లో ఎన్నో అద్భుతమైన కార్లు ఉన్నాయి. అందులో కొత్తవాటితో పాటు పాతవి కూడా దర్శనమిస్తాయి. వెహికిల్స్‌ అంటే మనసుపారేసుకునే ధోనీ.. ప్రస్తుతం ల్యాండ్ రోవర్‌ను ఆన్‌లైన్ వేలంలో కొనుగోలు చేయడం గమనార్హం. అయితే ఈ వేలంలో రోల్స్ రాయిస్, కాడిలాక్స్, బ్యూక్స్, చేవ్రొలెట్స్, ల్యాండ్ రోవర్స్, ఆస్టిన్, మెర్సిడెస్ లాంటి ఖరీదైన 19 కార్లు ఉన్నాయి.

ల్యాండ్ రోవర్ సిరీస్ 3 అనేది 1971-1985 మధ్యకాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలిచింది. దాదాపు 4.4 లక్షల కార్లను ఆ సమయంలో కంపెనీ తయారు చేసిందంట.

ల్యాండ్ రోవర్ సిరీస్ 3 స్టేషన్ వ్యాగన్‌ను ధోని కొనుగోలు చేయడంతో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన అరుదైన వెహికిల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మోడల్ పసుపు రంగులో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ సమయంలో ఉన్న పరిస్థితులకు తగ్గట్లు ఈ వెహికిల్‌ను తయారు చేశారు. ఇందులో ఫీచర్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ధోని కొనుగోలు చేసిన వెహికిల్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో స్పష్టంగా తెలియలేదు.

బీబీటీ వ్యవస్థాపకుడు, ఎండీ జతిన్ అహుజా మాట్లాడుతూ, “వింటేజ్ కార్లు, క్లాసిక్ కార్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్ల పరిశ్రమగా మారింది. దీన్ని సమర్థవంతమైన మార్గంలో పరిచయం చేసిన మొదటి కంపెనీగా మేం పేరుగాంచాం. భారతదేశంలోనూ పాతకాలానికి చెందిన కార్లను ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. వీరికోసం ఈ వేలం నిర్వహించాం. వింటేజ్ కార్, క్లాసిక్ కారును సొంతం చేసుకోవడం అనేది పెయింటింగ్‌ను సొంతం చేసుకోవడం లాంటింది. అంటే ఓ కళాఖండాన్ని సొంతం చేసుకోవడం లాంటి అపూర్వ అనుభవం అందిస్తోంది. క్రమంగా ఈ వ్యాపారం బాగా విస్తరిస్తోంది. అలాగే దేశంలోని కార్ల ఔత్సాహికులందరికీ అత్యుత్తమ వింటేజ్, క్లాసిక్ కార్లను అందించడానికి మేం మా వంతు కృషి చేస్తాం. ప్రజలు కోరుకునే పాతకాలపు, క్లాసిక్ కార్లను ఎల్లప్పుడూ మేం అందిస్తుంటాం” అంటూ పేర్కొన్నారు.

వోక్స్‌వ్యాగన్ బీటిల్‌తో వేలం ప్రారంభమైనట్లు బీబీటీ వెల్లడించింది. రూ.1 లక్ష నుంచి రూ. 25 లక్షల వరకు ఈ వేలం జరిగినట్లు పేర్కొంది. ఈ సంస్థ ప్రతి రెండు నెలలకు ఓసారి ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తోంది. తదుపరి వేలం ఫిబ్రవరి 2022లో నిర్వహించనున్నట్లు బీబీటీ తెలిపింది.

Also Read: IND Vs SA: దంచికొట్టిన బావుమా, డస్సెన్‌లు.. బిత్తరపోయిన భారత బౌలర్లు.. భారత టార్గెట్‌ 297 పరుగులు

22 ఫోర్లు, 4 సిక్సర్లతో సూపర్ సెంచరీ.. 8గురి బౌలర్ల ఊచకోత.. వీరవిహారం చేసిన కోహ్లీమేట్.!