Sachin Tendulkar: సచిన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలరా.. సాల్వ్ చేస్తే.. మీకన్నా తోపు లేరంతే..

|

Sep 16, 2022 | 3:16 PM

భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొంటున్నాడు. దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఉన్న ఒక ఫొటోను నెట్టింట్లో పంచుకున్నాడు.

Sachin Tendulkar: సచిన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలరా.. సాల్వ్ చేస్తే.. మీకన్నా తోపు లేరంతే..
Sachin Tendulkar
Follow us on

భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఈ సిరీస్‌లో ఆడుతున్న అనుభవజ్ఞులతో ఒక ఫొటోను పంచుకున్నాడు. ఈ ఫొటో ట్వీట్ చేస్తూ, ఫ్యాన్స్‌ను ఓ ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానం ఇవ్వడం అంటే మరి చుక్కలు కనిపించాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. సచిన్‌తో పాటు యువరాజ్ సింగ్, ఆస్ట్రేలియా ప్లేయర్లు బ్రెట్ లీ, షేన్ వాట్సన్ సచిన్ షేర్ చేసిన ఫొటోలో కనిపించారు. అయితే, ఈ ఫొటోలో ఎన్ని పరుగులు, వికెట్లు ఉన్నాయో మీరు చెప్పగలరా’ అంటూ సచిన్ క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇందులో ఉన్న దిగ్గజ ఆటగాళ్ల వికెట్లు, పరుగులను లెక్కించడం అంటే చాలా కష్టమే కదా.

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తమ అభిమాన క్రికెట్ స్టార్‌లను మళ్లీ చూసే అవకాశాన్ని పొందుతున్నారు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, బ్రియాన్ లారా, బ్రెట్ లీ వంటి దిగ్గజాలు ఈ సిరీస్‌లో భాగమయ్యారు.

ఇవి కూడా చదవండి

సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ టీమ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఈ సిరీస్‌లో పాల్గొంటున్నాయి. ఇది సిరీస్‌లో రెండో సీజన్‌.

బుధవారం వెస్టిండీస్‌తో ఇండియన్ లెజెండ్స్ తలపడాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా వేయలేకపోయింది. ఆ తర్వాత షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేశారు. మ్యాచ్‌ల తేదీతో పాటు వేదికను కూడా మార్చారు.