IND vs SL: రోహిత్ శర్మతో పాటు మరో ఇద్దరు.. లంకలో రీఎంట్రీ ఇవ్వనున్న కీలక ఆటగాళ్లు..

|

Jul 18, 2024 | 2:45 PM

India vs Sri Lanka 2024: భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జులై 27 నుంచి సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తన కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. కాబట్టి గౌతీకి ఇది చాలా ముఖ్యమైన సిరీస్. ఈ సిరీస్‌లో భారత జట్టు 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

IND vs SL: రోహిత్ శర్మతో పాటు మరో ఇద్దరు.. లంకలో రీఎంట్రీ ఇవ్వనున్న కీలక ఆటగాళ్లు..
Rohit Sharma
Follow us on

India vs Sri Lanka: శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించనున్నాడని సమాచారం. ఈ సిరీస్ నుంచి హిట్‌మ్యాన్ విరామం తీసుకుంటాడని గతంలో వార్తలు వెలువడ్డాయి. లంకతో వన్డే సిరీస్‌లో ఆడాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు సమాచారం.

రోహిత్ శర్మతో పాటు, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఈ సిరీస్ ద్వారా టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నారు. ఈ టీ20 ప్రపంచకప్‌నకు ఈ ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయలేదు.

ఇప్పుడు, శ్రీలంకతో వన్డే సిరీస్ ద్వారా కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మళ్లీ భారత జట్టులో కనిపించనున్నారు. అయితే ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ కనిపించడం అనుమానమే.

ఇవి కూడా చదవండి

ఇద్దరికి విశ్రాంతి..

శ్రీలంకతో జరిగే సిరీస్‌లో టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ సిరీస్‌లో కనిపించరు.

వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం కాగా, జస్ప్రీత్ బుమ్రా వన్డే, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ లేదా ఖలీల్ అహ్మద్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది.

భారత్-శ్రీలంక సిరీస్ ఎప్పుడు?

జులై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం 6 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముందుగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, తర్వాత వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఎలా ఉందో ఓసారి చూద్దాం..

భారత్ vs శ్రీలంక సిరీస్ షెడ్యూల్:

మొదటి T20: జులై 27 (పల్లెకెలె) – 7 PM IST

రెండవ T20: జులై 28 (పల్లెకెలె) – 7 PM IST

మూడవ T20: జులై 30 (పల్లెకెలె) – 7 PM IST

మొదటి ODI: ఆగస్టు 2 (కొలంబో) – 2.30 PM IST

రెండవ ODI: ఆగస్టు 4 (కొలంబో) – 2.30 PM IST

మూడవ ODI: ఆగస్టు 7 (కొలంబో) – 2.30 PM IST

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..