Rohit Sharma Retirement: తొలి ట్రోఫీతో ఆరంభించి, రెండో ట్రోఫీతో వీడ్కోలు.. 17 ఏళ్ల టీ20 కెరీర్‌కు రోహిత్ గుడ్‌బై

Rohit Sharma Retirement: 2013 నుంచి గత 11 ఏళ్లలో భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో జట్టు ఫైనల్‌కు చేరుకుంది. కానీ, ఓడిపోయింది. ఇప్పుడు 2024 టీ20 ప్రపంచకప్‌లో, అదే రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. టీమిండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు.

Rohit Sharma Retirement: తొలి ట్రోఫీతో ఆరంభించి, రెండో ట్రోఫీతో వీడ్కోలు.. 17 ఏళ్ల టీ20 కెరీర్‌కు రోహిత్ గుడ్‌బై
Rohit Sharma Retirement

Updated on: Jun 30, 2024 | 7:56 AM

Rohit Sharma Retirement: 2013 నుంచి గత 11 ఏళ్లలో భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో జట్టు ఫైనల్‌కు చేరుకుంది. కానీ, ఓడిపోయింది. ఇప్పుడు 2024 టీ20 ప్రపంచకప్‌లో, అదే రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. టీమిండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. అంతకు ముందు, విరాట్ కోహ్లి కూడా మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు . అంటే ఈ ఫార్మాట్‌లో భారత్‌కు ఇప్పుడు ఒక శకం ముగిసిందని అర్థం.

రోహిత్ శర్మ వన్డే, టెస్టు ఆడతాడా?

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ వేడుకలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌కు సంబంధించి ఏమీ చెప్పలేదు. అయితే మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేశాడు. విరాట్ కోహ్లీ మాదిరిగానే, అతను కూడా టీమ్ ఇండియాకు ఇది తన చివరి T20 అంతర్జాతీయ మ్యాచ్ అని చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పుడు అతను T20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నాడు. ఇదొక్కటే కాదు, రోహిత్, విరాట్ ఇద్దరూ వన్డేలు, టెస్టుల్లో టీమ్ ఇండియా తరపున ఆడడం కూడా స్పష్టంగానే కనిపిస్తోంది.


టీ20 ఇంటర్నేషనల్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రశ్నపై రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘ఇది నా చివరి టీ20 ఇంటర్నేషనల్ కూడా. ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయం. నేను కోరుకున్నది ఇదే, నాకు కప్పు కావాలి, నేను దానిని పొందాను. దీంతో పాటు ఈ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్‌కు అంకితమిస్తున్నట్లు రోహిత్ ప్రకటన ఇచ్చాడు. ప్రస్తుత భారత జట్టుతో ప్రపంచకప్ గెలవడం తన అదృష్టమని కూడా పేర్కొన్నాడు.

రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ కెరీర్ ఎలా ఉంది?


ప్రస్తుతం అన్ని టీ20 ప్రపంచకప్‌లు ఆడిన ఏకైక భారత ఆటగాడు రోహిత్ శర్మ. అతను 2007 T20 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత, ఇప్పుడు 2024లో, అతని కెప్టెన్సీలో, జట్టు ఈ టోర్నీని గెలుచుకుంది. రోహిత్ శర్మ తన లాంగ్ కెరీర్‌లో మొత్తం 159 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 4231 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధికంగా 5 సెంచరీలు చేసిన రికార్డు కూడా అతని పేరిటే ఉంది. టీ20 ఇంటర్నేషనల్‌లో రోహిత్ మొత్తం 32 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ఈ చారిత్రక రికార్డుతో తన ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..