ఎక్కడ పోగొట్టుకున్నాడో.. అక్కడే సాధించాడు.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విమర్శలకు చెక్ పెట్టిన భారత ప్లేయర్..
బాధలో ఉన్నాడని జాలీ చూపలేదు. పైగా నాలుగు రాళ్లు వేస్తూ, ఇక పనికి రాడంటూ, తీవ్రంగా విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలోనే ఈ ప్లేయర్‌కు ప్రత్యామ్నాయంగా మరో యంగ్ ప్లేయర్‌ను బీసీసీఐ రంగంలోకి దింపింది.
ఏడాదిగా గాయాలు.. నిరంతరం ఫిట్‌నెస్ సమస్యలు.. బరిలోకి దిగితే ఘోర వైఫల్యాలు.. ప్రదర్శనలో నిలకడ లేమీతో ఇబ్బందులు.. కట్ చేస్తే.. రీ ఎంట్రీతో విమర్శకులు సైతం నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడు. బాధలో ఉన్నాడని జాలీ చూపలేదు. పైగా నాలుగు రాళ్లు వేస్తూ, ఇక పనికి రాడంటూ, తీవ్రంగా విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలోనే ఈ ప్లేయర్‌కు ప్రత్యామ్నాయంగా మరో యంగ్ ప్లేయర్‌ను బీసీసీఐ రంగంలోకి దింపింది. ఇక అక్కడితో ఈ సీనియర్ ప్లేయర్ ఖేల్ ఖతమైందని, దుకాణం మూసుకోవాల్సిందేనంటూ కామెంట్లు చేశారు. అయితే, ఇలాంటి విమర్శలకు, సూటిపోటీ మాటలకు భయపడకుండా, తన రీ ఎంట్రీతో విమర్శకులకు సమాధానం ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకుని, అహర్నిశలు శ్రమించాడు. గాయాలనుంచి కోలుకున్నాడు. ఫిట్‌నెస్ టెస్టులో పాలయ్యాడు. అయితే, ఐపీఎల్‌ను వేదికగా చేసుకుని, సత్తా చాటాడు. దీంతో తన ఫిట్‌నెస్‌పై వస్తోన్న ఆరోపణలకు గట్టిగా సమాధానమిచ్చాడు. ఆపై నేరుగా సెలక్టర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆపై కెప్టెన్‌గా మారి తొలి సిరీస్‌ను గెలుపొందాడు. అయనెవరో కాదు.. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ, టీ20 ప్రపంచ కప్‌లో తన స్థానం ఎందుకు కీలకమో చాటి చెబుతున్నాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ తనదైన ముద్ర వేశాడు. తొలుత బ్యాటింగ్‌లో 51 పరుగులతో అర్ధశతకం సాధించిన హార్దిక్.. ఆ తర్వాత బౌలింగ్‌లో 33 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో పాటు తన పేరిట ఒక రికార్డును సృష్టించాడు.
హార్దిక్ పాండ్యా ఫాంలో లేని సమయంలో జట్టులోకి వెంకటేష్ అయ్యర్ ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నా.. ఆ తర్వాత పెద్దగా సత్తా చాటలేకపోయాడు. అయితే, వెంకటేష్ అయ్యర్‌ను హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా పోల్చారు. దీంతో, రీఎంట్రీలో సత్తా చాటుతూ, దూసుకెళ్తోన్న హార్దిక్.. తనకు ఎవరూ పోటీ కాదని, ప్రత్యామ్నాయం లేరని సమాధానమిచ్చాడు.
For his brilliant show with the bat and ball, @hardikpandya7 is adjudged Player of the Match as #TeamIndia win the first T20I by 50 runs.
Take a 1-0 lead in the series.
Scorecard – https://t.co/Xq3B0KTRD1 #ENGvIND pic.twitter.com/oEavD7COnZ
— BCCI (@BCCI) July 7, 2022
ఐపీఎల్ 2022లో సారథిగా గుజరాత్ టైటాన్స్‌తో సరికొత్త పాత్రలో కనిపించిన హార్దిక్.. మొత్తం 15 మ్యాచ్‌ల్లో 1963 పరుగులు సాధించాడు. 147 స్ట్రైక్ రేట్‌తో 8 అర్థసెంచరీలతో బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. ఇక బౌలింగ్‌లో 8 వికెట్లు పడగొట్టాడు.
టీమిండియా తరపున 62 టీ20లు, 63 వన్డేలు, 11 టెస్టులు ఆడాడు. ఇందులో వరుసగా 758, 1286, 532 పరుగులు సాధించాడు. అలాగే, 1 సెంచరీ, 12 అర్థ సెంచరీలు చేశాడు. ఇక బౌలింగ్‌లో అన్ని ఫార్మాట్లలో 121 వికెట్లు పడగొట్టాడు. కాగా, హార్దిక్ పాండ్యా తనను తాను నిరూపించుకుని, అన్ని విభాగాల్లో సత్తా చాటడం టీమిండియాకు శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ 2022 కోసం సెలక్టర్లు అందర్నీ పరీక్షిస్తున్నారు. మంచి జట్టుకోసం ప్లాన్స్ మొదలుపెట్టారు. మరి ఈ జట్టులో హార్దిక్ పాండ్యా ప్లేస్ కన్‌ఫాం అయినట్లేనని తెలుస్తోంది.