AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TATA IPL 2023: నేటి నుంచే ఐపీఎల్‌ 16.. తొలిపోరు గుజరాత్ టైటాన్స్-సీఎస్‌కే మధ్యే..

ఐపీఎల్‌ నయా సీజన్‌ షురూ అవుతోంది. ఈరోజు నుంచి క్రికెట్‌ మెగా టోర్నీప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులకు ఇక సందడే సందడి. రెండు నెలల పాటు కాలక్షేపానికి ఢోకా లేదు. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. మెగా టోర్నీతో ఇక క్రికెట్ ఫ్యాన్స్‌ కు రెండు నెలలు పండగే పండగ.

TATA IPL 2023: నేటి నుంచే ఐపీఎల్‌ 16.. తొలిపోరు గుజరాత్ టైటాన్స్-సీఎస్‌కే మధ్యే..
IPL 2023
Shiva Prajapati
|

Updated on: Mar 31, 2023 | 6:25 AM

Share

ఐపీఎల్‌ నయా సీజన్‌ షురూ అవుతోంది. ఈరోజు నుంచి క్రికెట్‌ మెగా టోర్నీప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులకు ఇక సందడే సందడి. రెండు నెలల పాటు కాలక్షేపానికి ఢోకా లేదు. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. మెగా టోర్నీతో ఇక క్రికెట్ ఫ్యాన్స్‌ కు రెండు నెలలు పండగే పండగ. ప్రతి రోజూ రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కొన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం మూడున్నరకు నిర్వహించనున్నారు. గత ఏడాది మాదిరిగానే మొత్తం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి.

ఈరోజు నుంచి ప్రారంభమయ్యే టోర్నీ మే 21వరకు జరగనుంది. 50 రోజులకు పైగా జరిగే టోర్నీలో ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక టోర్నీకి చాలామంది స్టార్‌ ప్లేయర్లు దూరమైతే.. ఇంకొందరు దూరంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పంత్‌, అయ్యర్‌, బుమ్రా వంటి స్టార్లు గాయాలతో ఐపీఎల్‌ ఆడే పరిస్థితి లేదు. ఇక స్టార్‌ ప్లేయర్లైన రోహిత్‌ శర్మ, కోహ్లీ, షమీ ఈసారి కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాలని డిసైడ్‌ అయ్యారు. దీంతో కీలక మ్యాచ్‌లలోనే వీరు అందుబాటులోకి రానున్నారు.

సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ మార్‌క్రమ్‌ ఏప్రిల్‌ 3 తర్వాతే భారత్‌ చేరుకుంటాడు. దీంతో ఏప్రిల్‌ 1న లక్నోతో జరగనున్న తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు మార్‌క్రమ్‌. ఇటీవల సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టుకు కెప్టెన్‌ మార్‌క్రమే. దీంతో సన్‌రైజర్స్‌ అతడి నాయత్వంపై బోలెడు ఆశలు పెట్టుకుంది. తొలి మ్యాచ్‌కు భువి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సీఎస్కే, ఆర్సీబీ, ముంబై వంటి టాప్‌ జట్లు కప్‌పై కన్నేశాయి. కాని సన్‌రైజర్స్‌ యంగ్‌ టీమ్‌తో బరిలోకి దిగుతోంది. అద్భుతాలు చేయడానికి రెడీ అంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!