Cricket: ఆ దేశంలో క్రికెట్ నిషేధం.. దిగ్గజ జట్లనే ఓడించిన టీంకు ఊహించని షాక్..

|

Sep 14, 2024 | 6:30 PM

Afghanistan Cricket: ఆఫ్ఘనిస్థాన్‌లో జెంటిల్‌మన్ గేమ్‌ను పూర్తిగా నిషేధించేందుకు తాలిబన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి అధికారిక సమాచారం లేనప్పటికీ, తాలిబాన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా దేశంలో క్రికెట్‌ను నిషేధించాలని ఆదేశించినట్లు చాలా నివేదికలు చెబుతున్నాయి.

Cricket: ఆ దేశంలో క్రికెట్ నిషేధం.. దిగ్గజ జట్లనే ఓడించిన టీంకు ఊహించని షాక్..
Afghanistan Cricket
Follow us on

Afghanistan Cricket: కొద్ది నెలల క్రితం అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో.. బలమైన జట్లను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకోవడంలో సఫలమైన ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టును యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసించింది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం తమ దేశంలో క్రికెట్‌ను పూర్తిగా నిషేధించేందుకు సిద్ధమవుతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం లేనప్పటికీ, తాలిబాన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా దేశంలో క్రికెట్‌ను నిషేధించాలని ఆదేశించినట్లు చాలా నివేదికలు చెబుతున్నాయి.

కొన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం క్రికెట్ ఆట దేశంలో చెడు వాతావరణాన్ని సృష్టిస్తోంది. అలాగే ఈ గేమ్ షరియా చట్టానికి విరుద్ధం. అందుకే ఈ గేమ్‌ను దేశంలో నిషేధిస్తున్నట్లు తాలిబన్‌ల అత్యున్నత నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా చెప్పినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

నిజానికి ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట, తాలిబాన్ ప్రభుత్వం మహిళల క్రికెట్, మహిళలు పాల్గొనే అన్ని ఇతర క్రీడలను నిషేధించింది. ఇప్పుడు పురుషుల క్రికెట్‌ను కూడా నిలిపివేయాలని యోచిస్తున్నారు. తాలిబాన్ ప్రభుత్వం ఈ చర్య క్రికెట్ ప్రపంచంలో భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆఫ్ఘన్ క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. ప్రభుత్వం విధించిన ఈ నిషేధాన్ని ఎప్పుడు, ఎలా అమలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

భారత్‌లో ఆఫ్ఘన్ జట్టు..

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. న్యూజిలాండ్‌తో గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడం, గ్రౌండ్‌ పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈ మ్యాచ్‌ రద్దయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌ను రద్దు చేయడం ఇరు జట్లకు నిరాశను మిగిల్చింది. ఈలోగా తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అఫ్గాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లలో మరింత ఆందోళనకు గురి చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..