Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ఆతిథ్య జట్టును నీడలా వెంటాడుతోన్న కరోనా.. వైరస్‌ బారిన పడిన మరో స్టార్‌ ప్లేయర్‌

శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా కొవిడ్‌ బారిన పడగా.. తాజాగా జట్టులో ఉన్న ఏకైక వికెట్‌ కీపర్‌ అండ్‌ స్టార్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

T20 World Cup: ఆతిథ్య జట్టును నీడలా వెంటాడుతోన్న కరోనా.. వైరస్‌ బారిన పడిన మరో స్టార్‌ ప్లేయర్‌
Matthew Wade, Maxwell
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2022 | 8:29 AM

టీ20 వరల్డ్‌కప్‌లో డిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే చిత్తుగా ఓడింది. అయితే శ్రీలంకతో జరిగిన రెండో పోరులో సమష్ఠిగా విజయం సాధించింది. కాగా ఈ ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టును కరోనా మహమ్మారి నీడలా వెంటాడుతోంది. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా కొవిడ్‌ బారిన పడగా.. తాజాగా జట్టులో ఉన్న ఏకైక వికెట్‌ కీపర్‌ అండ్‌ స్టార్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే సూపర్‌12లో భాగంగా నేడు (అక్టోబర్‌ 28) పటిష్ఠమైన ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది ఆసీస్‌. వేడ్‌ కొవిడ్‌ బారిన పడడం, జట్టులో మరో బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌ లేకపోవడంతో ఆసీస్‌ యాజమాన్యం తలలు పట్టుకుంటోంది. మొదట వరల్డ్‌కప్‌ స్క్వాడ్‌లో బ్యాకప్‌ వికెట్‌కీపర్‌గా జోష్‌ ఇంగ్లిష్‌ను ఎంపిక చేసినప్పటికీ.. గాయం కారణంగా అతను టోర్నీ ప్రారంభానికి ముందే తప్పుకున్నాడు.

మ్యాక్సీ లేదా వార్నర్‌..

ప్రస్తుతానికి వేడ్‌లో కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలుస్తోంది. దీనికితోడు సెమీస్‌ రేసులో నిలవాలంటే ఇంగ్లండ్‌పై గెలుపు చాలా కీలకం కాబట్టి వేడ్‌ను ఎలాగైనా బరిలోకి దిగాలని ఆసీస్‌ యాజమాన్యం భావిస్తోంది. ఒకవేళ మ్యాచ్‌ సమయానికి వేడ్‌లో కొవిడ్‌ లక్షణాలు అధికమైతే.. అతని స్థానంలో మ్యాక్స్‌వెల్‌, వార్నర్‌లతో ఎవరో ఒకరికి కీపింగ్‌ బాధ్యతలు అప్పజెప్పాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రాక్టీస్‌ సెషన్‌లో మ్యాక్స్‌వెల్‌, వార్నర్‌ ఇద్దరు కూడా కీపింగ్‌ ప్రాక్టీస్‌ కూడా చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

కాగా కరోనా బారిన పడ్డ ఆటగాళ్లు కూడా మ్యాచ్‌లు ఆడవచ్చని ఇటీవలే ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 23న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఆల్‌రౌండర్‌ జార్జ్‌ డాక్రెల్‌ కోవిడ్‌ నిర్ధారణ అయ్యినప్పటికీ బరిలోకి దిగాడు. వేడ్‌ విషయంలోనూ అదే జరగవచ్చునని తెలుస్తోంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..