టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కు వెళ్లే మార్గం ఇప్పుడు సుగమమైపోయింది. భారత్ చేతలో ఓటమితో ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ జట్టు ప్రయాణం దాదాపుగా ముగిసింది. శనివారం (జూన్ 22) బంగ్లాదేశ్ తో జరిగిన మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 196 పరుగుల టార్గెట్ ను విధించింది. అయితే బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్‌పై భారత్ 50 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. భారత్ 4 పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కూడా బాగానే ఉంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్ గా పేరున్న విరాట్ కోహ్లీ బంతి కోసం గ్యాలరీలో ఉన్న స్టాండ్స్ లోకి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. కెప్టెన్ రోహిత్ శర్మ 18వ ఓవర్‌ను స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు అప్పగించాడు. ఈ ఓవర్ చివరి బంతికి రిషద్ హొస్సేన్ భారీ సిక్సర్ బాదాడు. ఈ సిక్స్ మైదానంలో ఉంచిన స్టాండ్స్ కిందకు వెళ్లింది. అయితే ఆ బంతిని తీసి ఇచ్చేందుకు ఎవరూ రాలేదు. దీంతో తన స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి టేబుల్ కిందకు దూరాడు కింగ్ కోహ్లీ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చారు. విరాట్ కోహ్లి గల్లీ క్రికెట్‌ని గుర్తుచేశాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
విరాట్ కోహ్లి గత కొన్ని మ్యాచ్‌లుగా ఫామ్ దొరక్క ఇబ్బంది పడుతున్నాడు. కానీ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ మోస్తరుగా ఆడాడు. 28 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సర్లు, 1 ఫోర్ ఉన్నాయి.
Virat Kohli 🐐 finding the ball.
– Gully cricket vibes. 😂❤️ pic.twitter.com/gPNi3bTsUr
— 𐌑ⲅ Ꭺɴɪsʜ¹⁸ (@Number18only) June 22, 2024
ఇప్పుడు భారత్ తదుపరి మ్యాచ్ జూన్ 24న ఆస్ట్రేలియాతో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అలాగే విరాట్ కోహ్లి పై కూడా అందరి దృష్టి ఉంది.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్(కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..