T20 World Cup 2024: ఆసీస్‌పై అఫ్గాన్ విజయం.. మారిన సెమీస్ లెక్కలు.. అదే జరిగితే టోర్నీ నుంచి టీమిండియా ఔట్
T20 ప్రపంచ కప్ సూపర్-8 రౌండ్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితగా జరుగుతున్నాయి. గ్రూప్-1లో పోటీపడుతున్న 4 జట్లలో మూడు జట్లు సెమీఫైనల్ రేసులో ఉన్నాయి. ముఖ్యంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ పోరుగా మారింది. జూన్ 25న జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా నేరుగా సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది
T20 ప్రపంచ కప్ సూపర్-8 రౌండ్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితగా జరుగుతున్నాయి. గ్రూప్-1లో పోటీపడుతున్న 4 జట్లలో మూడు జట్లు సెమీఫైనల్ రేసులో ఉన్నాయి. ముఖ్యంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ పోరుగా మారింది. జూన్ 25న జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా నేరుగా సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు గెలిస్తే నెట్ రన్ రేట్ లెక్కలోకి వస్తుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో, టీమ్ ఇండియా 4 పాయింట్లతో +2.425 నెట్ రన్ రేట్‌తో ఉంది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 2 పాయింట్లతో +0.223 నెట్ రన్ రేట్ తో ఉంది. అలాగే ఆఫ్ఘనిస్థాన్ జట్టు 2 పాయింట్ల నెట్ రన్ రేట్ -0.650తో మూడో స్థానంలో ఉంది. 2 మ్యాచ్‌లు ఓడిన బంగ్లాదేశ్ -2.489 నెట్ రన్ రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది.
సెమీఫైనల్‌కు వెళ్లే మార్గమిదే..
- భారత జట్టు ఆస్ట్రేలియా జట్టును ఓడిస్తే నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
- భారత జట్టు ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓడిపోతే.. ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఫలితం కోసం టీమిండియా వేచిచూడక తప్పదు.
- ఒకవేళ భారత్ ఆస్ట్రేలియాను ఓడిస్తే, బంగ్లాదేశ్‌పై విజయం సాధించి ఆఫ్ఘనిస్థాన్ సెమీ ఫైనల్‌కు చేరుకోవచ్చు.
- ఆస్ట్రేలియా జట్టు భారత జట్టును ఓడించి మంచి నెట్ రన్ రేట్ తో అగ్రస్థానంలో నిలిస్తే.. ఆఫ్ఘనిస్థాన్ జట్టు నెట్ రన్ రేట్ ద్వారా భారత జట్టును అధిగమించి సెమీఫైనల్ కు చేరే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోతే ఆఫ్ఘనిస్థాన్ జట్టు సెమీఫైనల్ చేరే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే సూపర్-8 రౌండ్ చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. దీన్ని బట్టి ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఎన్ని పరుగులతో గెలుపొందాలనే దానిపై స్పష్టత వస్తుంది. దీని ద్వారా ఆఫ్ఘనిస్థాన్ జట్టు భారత్ లేదా ఆస్ట్రేలియా జట్టును అధిగమించి నెట్ రన్ రేట్ ద్వారా సెమీఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆస్ట్రేలియాపై టీమిండియా ఓడిపోయే పరిస్థితి వస్తే నెట్ రన్ రేట్ తగ్గకుండా చూసుకోవాలి.
ఆస్ట్రేలియాపై భారత జట్టు గెలిస్తే నేరుగా సెమీస్‌లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఆసీస్‌పై టీమిండియా ఓడిపోయే పరిస్థితిని ఎదుర్కొంటే.. అవమానకరమైన ఓటమిని తప్పించుకోవాలి. దీంతో నెట్ రన్ రేట్ పడిపోకుండా చూసుకోవాలి. పాయింట్ల పట్టికలో భారత జట్టు రెండో స్థానానికి పడిపోతే టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. ఎందుకంటే చివరి మ్యాచ్ ద్వారా ఆఫ్ఘనిస్థాన్ జట్టు రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి టీం ఇండియా ఆస్ట్రేలియాపై గెలవాలి లేదా ఘోర పరాజయాన్ని తప్పించుకోవాలి. దీని ద్వారా టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలి. దీంతో భారత్‌పై గెలిచినా.. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలోనే కొనసాగుతుంది. బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ భారీ విజయాన్ని నమోదు చేసినా మంచి నెట్ రన్ రేట్ సహాయంతో, వారు ఆస్ట్రేలియా జట్టును అధిగమించి పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకోవచ్చు. దీని ద్వారా ఆఫ్ఘనిస్థాన్ జట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు. మొత్తానికి తదుపరి మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్‌తో భారత్ ఓడిపోతే, టీ20 ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించే అవకాశముందన్న మాట.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..