Suryakumar Yadav Catch: ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. గత నెల రోజులుగా టైటిల్ ఛేజింగ్‌లో ఉన్న టీమిండియా.. ఎట్టకేలకు ట్రోఫీపై తన పేరును లిఖించుకుంది. దీంతో 17 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కరువుకు టీమిండియా తెరదించింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 177 పరుగుల సవాల్ విసిరింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు చివరి 5 ఓవర్ల వరకు ఫేవరెట్‌గా నిలిచింది. కానీ తుఫాన్ బ్యాటింగ్‌తో భారత్‌ను భయపెట్టిన హెన్రిచ్ క్లాసెన్‌ను పెవిలియన్ చేర్చడం ద్వారా హార్దిక్ పాండ్యా ఆటను మలుపు తిప్పాడు. అంతేకాదు ఆఖరి ఓవర్ తొలి బంతికే డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్‌ను సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌గా మలిచి మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మలిచాడు. దీంతో 2007లో పాకిస్తాన్‌పై శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌ను తలపించిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీశాంత్ పట్టిన క్యాచ్ ట్రోఫిని అందిచగా.. సూర్య కుమార్ పట్టిన క్యాచ్‌తో మరోసారి ట్రోఫిని దక్కించుకునేలా చేసింది.
వాస్తవానికి దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. డేవిడ్ మిల్లర్ తొలి బంతికే భారీ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, బౌండరీలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి పొరపాటు చేయకుండా అద్భుత క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ పట్టడంలో సూర్యకుమార్ యాదవ్ చిన్న పొరపాటు చేసి ఉంటే ప్రపంచకప్ కల చెదిరిపోయేది. తొలి బంతికే హార్దిక్ పాండ్యా వైడ్ ఫుల్ టాస్ వేశాడు. డేవిడ్ మిల్లర్ దానిని సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించాడు. బంతి మిల్లర్ బ్యాట్‌కు తగిలి ఆకాశంలోకి దూసుకెళ్లింది. అంతా సిక్స్ అవుతుందని భావించారు. కానీ, సూర్య బౌండరీ లోపల బంతిని క్యాచ్ చేశాడు. అతను బౌండరీ దాటకముందే, బంతిని లోపలికి విసిరి మళ్లీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ కారణంగా మ్యాచ్ మొత్తం భారత్‌కు అనుకూలంగా మారింది.
What A Catch By Suryakumar Yadav 🔥🔥
Game changing catch 🥹❤️
Congratulations India 🇮🇳#INDvSA #T20WorldCup pic.twitter.com/F85X7hMTfG— Basit kachhi (@BKachhi33082) June 29, 2024
Greatest catch in history of world cup finals. #SuryakumarYadav🔥🔥🔥#INDvSA #T20WorldCuppic.twitter.com/SAaIrPhnei
— Mohammed Ihsan (@ihsan21792) June 29, 2024
డేవిడ్ మిల్లర్ ఔటైన తర్వాత దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమైంది. ఈ వికెట్ తర్వాత, ఆఫ్రికన్ జట్టులోని ఏ బ్యాట్స్‌మెన్ కూడా 5 బంతుల్లో 16 పరుగులు చేయలేకపోయారు. తద్వారా చివరిగా దక్షిణాఫ్రికా చోకర్స్ టైటిల్‌ను నిలుపుకుంది. ఆఖర్లో రబడ తొలి బంతికే బౌండరీ బాది మ్యాచ్‌ను మళ్లీ ఉత్కంఠభరితంగా మార్చాడు. అయినప్పటికీ, పాండ్యా తన ధాటిని కొనసాగించి 7 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకోగలిగాడు.
This day, in 2⃣0⃣0⃣7⃣#TeamIndia were crowned World T20 Champions 😎🇮🇳 pic.twitter.com/o7gUrTF8XN
— BCCI (@BCCI) September 24, 2019
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..