
Rishabh Pant Shares Funny Video: శనివారం రాత్రి బంగ్లాదేశ్‌ను 50 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) సెమీ-ఫైనల్‌లో తన స్థానాన్ని దాదాపుగా ధృవీకరించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా, హార్దిక్ పాండ్యా తుఫాన్ అర్ధ సెంచరీ సహాయంతో 196 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్ జట్టు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ 8లో భారత్ వరుసగా రెండవ విజయం సాధించింది. ఈ విజయంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా కీలక పాత్ర పోషించాడు . 24 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అయితే, మ్యాచ్ అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసి అభిమానులందరినీ నవ్వించాడు.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత, రిషబ్ పంత్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ యానిమేషన్ వీడియోలో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను చూసిన తర్వాత ఫ్యాన్స్ నవ్వకుండా ఉండలేకపోతున్నారు. వీడియోను షేర్ చేస్తూ.. రిషబ్ పంత్ క్యాప్షన్‌లో.. ‘మంచి విజయం. క్షమించండి బ్రదర్స్. నేను ఈ అద్భుతమైన వీడియోను పోస్ట్ చేయకుండా ఉండలేకపోయాను. స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ ఈ వీడియోను పోస్ట్ చేశాను’ అంటూ రాసుకొచ్చాడు.
18 నెలల తర్వాత ఈ T20 ప్రపంచ కప్‌లో రిషబ్ పంత్ అంతర్జాతీయ స్థాయిలో పునరాగమనం చేశాడు. ఇప్పటివరకు టోర్నమెంట్‌లో పంత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. రిషబ్ పంత్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 152 పరుగులు చేశాడు. భారత్ తరపున ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన పరంగా మొదటి స్థానంలో ఉన్నాడు. గ్రూప్ దశలో ఐర్లాండ్‌పై 36 నాటౌట్, పాకిస్థాన్‌పై 42, USAపై 18, ఆఫ్ఘనిస్తాన్‌పై 20, బంగ్లాదేశ్‌పై 36 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ వికెట్ వెనుక కూడా తన సత్తా చాటాడు. అతను టోర్నమెంట్‌లో ఇప్పటివరకు తన పేరు మీద 10 వికెట్లను అందుకున్నాడు. ప్రపంచ కప్‌లో ఏదైనా ఒక ఎడిషన్‌లో అత్యధిక 10 మందిని అవుట్ చేసిన రికార్డును పంత్ కలిగి ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..