Babar Azam: వివాదంలో పాకిస్తాన్ కెప్టెన్.. తొటి ఆటగాడిని అలా పిలిచాడా? సోషల్ మీడియాలో రచ్చ..

T20 World Cup 2024: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. బాబర్ ఆజం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో అతను ప్రాక్టీస్ సెషన్‌లో ఏదో మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో అతన్ని ట్రోల్ చేస్తున్నారు. తన సహచరుడు ఆజం ఖాన్‌ను ఖడ్గమృగం అని పిలిచాడని పాకిస్థాన్ కెప్టెన్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Babar Azam: వివాదంలో పాకిస్తాన్ కెప్టెన్.. తొటి ఆటగాడిని అలా పిలిచాడా? సోషల్ మీడియాలో రచ్చ..
Babar Azam Controversy

Updated on: Jun 03, 2024 | 9:43 PM

T20 World Cup 2024: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. బాబర్ ఆజం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో అతను ప్రాక్టీస్ సెషన్‌లో ఏదో మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో అతన్ని ట్రోల్ చేస్తున్నారు. తన సహచరుడు ఆజం ఖాన్‌ను ఖడ్గమృగం అని పిలిచాడని పాకిస్థాన్ కెప్టెన్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో, బాబర్ ఖడ్గమృగం అనే పదాన్ని ఉపయోగించాడా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.

బాబర్ అభిమానులు మాత్రం..

బాబర్ ఆజం వీడియో వైరల్ కావడంతో, అతని అభిమానులు పాక్ కెప్టెన్‌కు రక్షణగా నిలిచారు. బాబర్ అజామ్‌ను ఖడ్గమృగం అని పిలవలేదని అతని అభిమానులు పేర్కొన్నారు. బదులుగా అతను ఆజం ఖాన్‌కి పంజాబీలో ‘తేరా కైందా నీ సీధా హోయా’ అని అన్నాడంటూ తెలిపారు. అయితే, వీడియోలో వాయిస్ పూర్తిగా స్పష్టంగా లేకపోవడంతో, బాబర్ విమర్శకులు అతనిని ట్రోల్ చేస్తున్నారు.

అధిక బరువుతో ఆజం ఖాన్..

ఆజం ఖాన్ బరువు చాలా ఎక్కువనే విషయం తెలిసిందే. ఈ కారణంగా, అతని ఎంపికపై తరచుగా ప్రశ్నలు తలెత్తుతాయి. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వికెట్ కీపింగ్‌లో అజంఖాన్ చాలా తప్పులు చేశాడని, ఆ తర్వాత మరోసారి ఈ ఆటగాడు అధిక బరువుతో ఉన్నాడని ప్రశ్న తలెత్తుతున్నాయి.

పాకిస్థాన్ ప్రాక్టీస్ ప్రారంభం..

ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్ జట్టు డల్లాస్ చేరుకుంది. జూన్ 6న అమెరికాతో పాకిస్థాన్ తొలి మ్యాచ్ ఆడనుంది. దీని కోసం బాబర్ & కంపెనీ ప్రాక్టీస్ ప్రారంభించింది. డల్లాస్‌ తర్వాత పాకిస్థాన్‌ న్యూయార్క్‌కు వచ్చి జూన్‌ 9న టీమిండియాతో తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..