టీ20 ప్రపంచ కప్ 2022 ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య నేడు కీలక పోరు జరగనుంది. ఇంగ్లండ్‌కు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సెమీ ఫైనల్స్‌కు చేరుకోవచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా లేదా మ్యాచ్ ఫలితం రాకుంటే మాత్రం ఇంగ్లండ్ సెమీస్ లెక్కల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మరోవైపు టీ20 ప్రపంచకప్ నుంచి శ్రీలంక జట్టు ఇప్పటికే నిష్క్రమించింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయంతో ప్రపంచకప్‌కు వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో ఈ మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియా చూపు కూడా ఈ మ్యాచ్‌పైనే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోతే ఆస్ట్రేలియాకు సెమీ-ఫైనల్ టిక్కెట్ లభిస్తుంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలవనుంది. నిజానికి ఇంగ్లండ్-శ్రీలంక మధ్య ఇప్పటి వరకు జరిగిన 13 టీ20 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 9 సార్లు విజయం సాధించింది. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీంను ఓడించింది. ప్రపంచకప్‌నకు ముందు కూడా ఈ జట్టు ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లను టీ20 సిరీస్‌లలో ఓడించింది. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు శ్రీలంకకు ప్రత్యేకంగా ఏమీ లేదు. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే నమీబియా వంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోయింది. సూపర్-12 రౌండ్‌లోనూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీందే పైచేయిగా నిలవనుంది.
గ్రూప్ 1 నుంచి సెమీస్ చేరే రెండో జట్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఈ స్థానం కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు కన్నేశాయి. అయితే, ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దుతో మొత్తం 7 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే, నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం నెగిటివ్‌లోనే ఉంచుకుంది. ఇక ఇంగ్లండ్ జట్టు విషయానికి వస్తే.. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దుతో మొత్తం 5 పాయింట్లు సాధించింది. శ్రీలంకపై విజయం సాధిస్తే మాత్రం సెమీస్ లిస్టులో చేరిపోతుంది. దీంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి తప్పుకుంటుంది. ఎందుకంటే ఇరు జట్లు 7 పాయింట్లతో సమంగా ఉంటాయి. అయితే, ఇంగ్లండ్ జట్టు నెట్ రన్ రేట్ ప్లస్‌లో ఉంది. అలా కాకుండా ఓడిపోయినా లేదా ఫలితం తేలకపోయినా ఇంగ్లండ్ జట్లు ఇంటికేపోనుంది.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ మలన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, కసున్ రజిత
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..