Watch Video: ప్లేయర్ ప్రాణాలతో చెలగాటాలా.. ఇదిగో అన్‌ఫిట్‌‌ వీడియో.. పాక్ బోర్డ్‌పై దుమ్మెత్తిపోస్తోన్న మాజీలు..

|

Oct 29, 2022 | 4:49 PM

Shaheen Afridi: T20 ప్రపంచ కప్ 2022లో ఆడిన రెండు మ్యాచ్‌లలో షాహీన్ అఫ్రిది పూర్తిగా విఫలమయ్యాడు. అటు వికెట్లు తీయలేక, ఇటు బంతిని వేగంగా విసరలేకపోవడంతోపాటు..

Watch Video: ప్లేయర్ ప్రాణాలతో చెలగాటాలా.. ఇదిగో అన్‌ఫిట్‌‌ వీడియో.. పాక్ బోర్డ్‌పై దుమ్మెత్తిపోస్తోన్న మాజీలు..
Shaheen Afridi
Follow us on

T20 వరల్డ్ కప్ 2022 లో పాకిస్థాన్ జట్టు గురువారం ఉత్కంఠభరితమైన ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. జింబాబ్వే చివరి బంతికి పాకిస్థాన్‌ను ఓడించింది. ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైన పాకిస్థాన్ జట్టు ఇప్పుడు సెమీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించే దశకు చేరుకుంది. పాకిస్థాన్ జట్టు ఈ ఫ్లాప్ ప్రదర్శనపై ఆటగాళ్లను తిట్టడం కంటే ఎక్కువగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు గల కారణం కూడా తీవ్రమైనదే. అందుకే ఈ విషయంపై విమర్శలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి.

ఎంపికలో లోపాలు..

పాక్ టీమ్ ఎంపిక విషయంలోనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది షాహీన్ అఫ్రిది గురించే. షాహీన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ అయినప్పటికీ, ఇటీవల అతను చాలా కాలంగా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతను గాయం నుంచి కోలుకున్నాడని టీం చెప్పుకొచ్చింది. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో అతని బౌలింగ్‌లో ఎలాంటి ఫలితం లేకపోవడంతో విమర్శలు ఎక్కువయ్యాయి. అతని రన్-అప్ కూడా నెమ్మదించింది. అలాగే బంతి వేగం కూడా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ క్రికెటర్ల నుంచి పాక్ అభిమానుల వరకు అతడిని జట్టులోకి తీసుకోవడం తప్పుగా భావిస్తున్నారు. సల్మాన్ బట్ వంటి మాజీ కెప్టెన్లు కూడా షాహీన్ పూర్తిగా ఫిట్‌గా లేడని చెప్పుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, తాజాగా ఒక వీడియోలో షాహీన్ పూర్తిగా ఫిట్‌గా లేడని కూడా వెల్లడించింది. ఈ వీడియో జింబాబ్వే జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి సంబంధించినది. దీనిని ఒక పాకిస్తానీ అభిమాని స్టేడియం నుంచి షూట్ చేశాడు. పీసీబీ అన్‌ఫిట్‌గా ఉన్న షాహీన్‌కు మ్యాచ్‌ల వారీగా అవకాశం ఇస్తున్నారనే రహస్యాన్ని ఈ వీడియో కోణం వెల్లడించింది.

జింబాబ్వేపై పాక్ జట్టు విజయానికి 3 పరుగులు అవసరమైనప్పుడు షాహీన్ ఆఫ్రిది బ్యాటింగ్ ఎండ్‌లో ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇక్కడ షాహీన్ షాట్ కొట్టాడు. కానీ, వేగంగా పరుగెత్తలేకపోయాడు. అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ చాలా తేలిగ్గా పరిగెత్తుకుంటూ క్రీజులోకి వచ్చినా షాహీన్ తడబడుతూ పరుగెడుతున్నాడు. చివరిగా అతను రనౌట్ అయ్యాడు.

ఫాంలోలేని షాహీన్..

షాహీన్ అఫ్రిది చాలా కాలం తర్వాత భారత్‌తో మ్యాచ్‌తో తిరిగి మైదానంలోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. జింబాబ్వేపై కూడా తేలిపోయాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. అలాగే బ్యాట్స్‌మెన్‌ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టినట్లు కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతని ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షాహీన్‌ ఫిట్‌గా లేనప్పుడు బలవంతంగా ఎందుకు ఆడిస్తున్నారని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు.