IND vs AUS: 6 ఫోర్లు, 3 సిక్సులు.. 172 స్ట్రైక్‌తో బ్యాటింగ్.. వరుస హాఫ్ సెంచరీలతో టీమిండియా ఓపెనర్ దూకుడు..

|

Oct 17, 2022 | 12:24 PM

IND vs AUS: T20 వరల్డ్ కప్ 2022 తొలి వార్మప్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాపై ఫిఫ్టీ కొట్టాడు. గత మూడు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసి, అద్భుత ఫాంతో దూసుకపోతున్నాడు.

IND vs AUS: 6 ఫోర్లు, 3 సిక్సులు.. 172 స్ట్రైక్‌తో బ్యాటింగ్.. వరుస హాఫ్ సెంచరీలతో టీమిండియా ఓపెనర్ దూకుడు..
Ind Vs Aus
Follow us on

T20 ప్రపంచ కప్ 2022 వార్మప్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 33 బంతుల్లో 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా తుఫాన్ హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఈ ప్రదర్శనతో బ్యాటింగ్ లో టీ20 ప్రపంచకప్‌ 2022కు టీమ్‌ఇండియా సరైన దిశలో పయనించే దిశగా సాగుతోందని భావిస్తున్నారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టుకు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఓపెనింగ్ జోడీ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ మైదానంలోకి రాగానే పరుగులు చేయడం ప్రారంభించారు. కేఎల్ రాహుల్ వచ్చిన వెంటనే ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. దీంతో రోహిత్ శర్మ స్ట్రైక్ రొటేట్ చేసే బాధ్యతను మాత్రమే తీసుకున్నాడు. వీరిద్దరి మధ్య తొలి వికెట్‌కు 7.3 ఓవర్లలో 78 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (57) పెవిలియన్ బాట పట్టాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో రాహుల్ స్ట్రైక్ రేట్ 172గా నిలిచింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కేఎల్ రాహుల్‌తో పాటు, సూర్యకుమార్ యాదవ్ కూడా తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య కుమార్ కేవలం 33 బంతుల్లో 1 సిక్స్, 6 ఫోర్లతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కేఎల్ రాహుల్ వరుసగా నాలుగో అర్ధ సెంచరీ..

ఇవి కూడా చదవండి

కేఎల్ రాహుల్ ప్రస్తుతం అద్భుతమైన లయలో ఉన్నాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కూడా అతను 74 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాకు రాకముందు దక్షిణాఫ్రికాతో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను తన బ్యాట్‌తో గత 10 ఇన్నింగ్స్‌లలో 6 అర్ధ సెంచరీలు సాధించాడు.