- Telugu News Photo Gallery Cricket photos Team india Captain rohit sharma flop again in icc t20 world cup india vs australia warm up match
IND Vs AUS: మరోసారి విఫలమైన భారత సారథి.. 10 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ..
ICC Mens T20 World Cup Warm-up Matches 2022: కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియాపై 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
Updated on: Oct 17, 2022 | 12:51 PM

బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాట్‌తో తుఫాను స్టైల్‌తో వీరవిహారం చేశాడు. అయితే, మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మరోసారి ఫ్లాప్ అయ్యాడు. రాహుల్ 33 బంతుల్లో 57 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, రోహిత్ శర్మ కేవలం 15 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో రోహిత్ పేలవ ఫాం మరోసారి బయటపడింది. ఫాంలోకి రాకుంటే మాత్రం.. టీమిండియాకు కష్టాల బారిన పడే ఛాన్స్ ఉంది.

రోహిత్ శర్మ కూడా బంతిని ఆడేందుకు ఎంతో కష్టపడ్డాడు. కేవలం 14 బంతులు మాత్రమే ఆడినా.. శ్రీక్కువగా పరుగులు చేయలేకపోయాడు. అగర్‌ను రోహిత్ అవుట్ చేశాడు. ఈ సమయంలో భారత కెప్టెన్ స్ట్రైక్ రేట్ 107.14గా ఉంది.

తొలి 4 ఓవర్లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతా కూడా తెరవలేదు. ఐదో ఓవర్లో మూడో బంతిని రోహిత్ శర్మ ఆడి ఖాతా తెరిచాడు. ఆ తర్వాత, మాక్స్‌వెల్ వేసిన బంతికి రోహిత్ శర్మ ఒక ఫోర్, సిక్స్ కొట్టాడు. అయితే అతను అగర్ వేసిన బంతికి వికెట్ కోల్పోయాడు.

రాహుల్, రోహిత్ మధ్య 78 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. అందులో 57 పరుగులు రాహుల్ చేసినవే కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ చాలా ఇబ్బంది పడ్డాడు. రోహిత్ శర్మ చివరి 10 టీ20 ఇన్నింగ్స్‌ల గురించి మాట్లాడితే.. కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. దీంతో టీమిండియాకు భారంగా మారాడని మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు.

వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ బ్యాట్ కూడా ఎక్కువ సేపు ఆడలేదు. 13 బంతుల్లో 19 పరుగులు చేసి విరాట్ ఔటయ్యాడు. అయితే కోహ్లీ ఈ చిన్న ఇన్నింగ్స్‌లో చాలా గొప్ప షాట్లు ఆడాడు.




