టీ20 వరల్డ్ కప్‌లో ఆదివారం భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీం ఇండియాకు వారం పాటు సమయం దొరికింది. బధవారం, గురువారం ప్రాక్టీస్ చేసిన ఆటగాళ్లు శుక్రవారం కాస్త సేద తీరారు. సముద్ర తీరాన బీచ్ వాలీబాల్ ఆడారు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. “#TeamIndia వారి సెలవుదినం సందర్భంగా బీచ్ వాలీబాల్ ఆట!” అని క్యాప్షన్ రాసింది. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.
A game of beach volleyball as #TeamIndia unwinds in their day off! ? ?#T20WorldCup pic.twitter.com/3JXOL17Rr3
— BCCI (@BCCI) October 29, 2021
సూపర్ 12లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కీవిస్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఇండియా తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. న్యూజిలాండ్ పరిస్థితి కూడా భారత్ లాగే ఉంది. కీవిస్ తన మొదటి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓడిపోయింది. గ్రూప్-2 పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది అగ్రస్థానంలో ఉంది. ఆఫ్ఘానిస్తాన్ రెండు స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, భారత్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. అయితే న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడా లేదా అన్నది అస్పష్టంగానే ఉంది. జులైలో శ్రీలంక పర్యటనలో టీమ్ ఇండియాకు హార్దిక్ చివరిగా బౌలింగ్ చేశాడు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్ నేపథ్యంలో గత అనుభవాలు టీం ఇండియాను ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2007 టీ20 ప్రపంచకప్, 2016 టీ20 వరల్డ్‌కప్, 2019 వన్డే ప్రపంచకప్, ఇటీవలి, మొట్టమొదటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లలో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. పాకిస్తా్న్‌కు కూడా టీ20, వన్డే వరల్డ్ కప్పుల్లో టీం ఇండియాపై పూర్ రికార్డు అయినా వారు భారత్‌ను ఓడించారు.
Read Also.. T20 World Cup 2021: న్యూజిలాండ్‌తో ఆడే జట్టులో మార్పు లేదా!.. శార్దూల్ ఠాకూర్‌కు ఈసారి అవకాశం లేనట్టే..