T20 World Cup 2026 : ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ నామినీలు వీరే.. రేసులో భారత్ నుంచి సంజూ శాంసన్

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేసులో నిలిచిన టాప్ నామినీలను ప్రకటిస్తూ ఐసీసీ అందరినీ ఆశ్చర్యపరిచింది.

T20 World Cup 2026 :  ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ నామినీలు వీరే.. రేసులో భారత్ నుంచి సంజూ శాంసన్
Sanju Samson

Updated on: Mar 08, 2026 | 9:09 AM

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేసులో నిలిచిన టాప్ నామినీలను ప్రకటిస్తూ ఐసీసీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆరు దేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా నుంచి సంజూ శాంసన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

సంజూ శాంసన్

భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఈ టోర్నీలో ఆకాశమే హద్దుగా రాణించాడు. వెస్టిండీస్‌పై అజేయంగా 97 పరుగులు చేయడమే కాకుండా, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 89 పరుగులు చేసి టీమిండియాను ఫైనల్ చేర్చాడు. భారత్ గనుక కప్పు గెలిస్తే, సంజూ పేరు ఈ అవార్డు రేసులో అందరికంటే ముందు ఉంటుంది.

కివీస్ జోడీ.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్

న్యూజిలాండ్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ టీమ్ సీఫెర్ట్ (274 పరుగులు), స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర (11 వికెట్లు) కూడా ఈ రేసులో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ తరఫున విల్ జాక్స్ ఒకే టోర్నీలో నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని రికార్డు సృష్టించాడు. అతని ఆల్‌రౌండ్ ప్రతిభ ఇంగ్లండ్ ప్రస్థానంలో హైలైట్‌గా నిలిచింది.

పాకిస్థాన్ సెన్సేషన్.. అమెరికా సంచలనం

పాకిస్థాన్ లీగ్ దశలోనే నిష్క్రమించినా, సాహిబ్జాదా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. ఒకే టీ20 వరల్డ్ కప్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచి, మొత్తం 383 పరుగులు చేశాడు. మరోవైపు, అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్‌విక్ ఈ టోర్నీలో అసలైన సంచలనం. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే 13 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌పై అతను తీసిన నాలుగు వికెట్ల ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

సౌతాఫ్రికా వీరులు

సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 286 పరుగులతో జట్టును ముందుండి నడిపించగా, బౌలర్ లుంగీ ఎన్గిడి అత్యంత నిలకడైన బౌలింగ్‌తో 12 వికెట్లు తీశాడు. టోర్నీ ఆద్యంతం అద్భుతమైన ఎకానమీతో బౌలింగ్ చేసిన ఎన్గిడి కూడా ఈ అవార్డుకు అర్హుడే. మరి ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఎనిమిది మందిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us