T20 Blast 2023: వామ్మో ఇదేం ఊచకోత భయ్యా.. 18 బంతుల్లో 268 స్ట్రైక్‌రేట్‌‌తో బీభత్సం.. టీ20 బ్లాస్ట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ..

T20 Blast 2023: ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో సామ్ కరణ్ తుఫాన్ హాఫ్ సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించాడు. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సర్రే, గ్లామోర్గాన్ జట్లు తలపడ్డాయి.

T20 Blast 2023: వామ్మో ఇదేం ఊచకోత భయ్యా.. 18 బంతుల్లో 268 స్ట్రైక్‌రేట్‌‌తో బీభత్సం.. టీ20 బ్లాస్ట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ..
T20 Blast 2023

Updated on: Jun 22, 2023 | 8:14 AM

T20 Blast 2023: ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో సామ్ కరణ్ తుఫాన్ హాఫ్ సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించాడు. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సర్రే, గ్లామోర్గాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గ్లామోర్గాన్ కెప్టెన్ కిరణ్ కార్ల్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. సర్రే జట్టు ఓపెనర్లు విల్ జాక్స్ (60), లారీ ఎవాన్స్ (40) శుభారంభం అందించారు.

ఓపెనింగ్ జోడీ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సునీల్ నరైన్, సామ్ కరన్ రన్ రేట్‌ను భారీగా పెంచారు. 19 బంతుల్లో 36 పరుగులు చేసి నరైన్ ఔటయ్యాడు.

అయితే మరోవైపు మెరుపుల వర్షం కురిపించిన సామ్ కరన్ కేవలం 18 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 బ్లాస్ట్‌లో సర్రే తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సామ్ కుర్రాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

చివరకు 22 బంతుల్లో 59 పరుగులు చేసి సామ్ కరణ్ ఔటయ్యాడు. కానీ, మరోవైపు సోదరుడు టామ్ కరణ్ 13 బంతుల్లో 23 పరుగులు చేసి జట్టు స్కోరును 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 238కి చేర్చాడు.

239 పరుగుల కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లామోర్గాన్ జట్టులో క్రిస్ కుక్ (49) మిగతా బ్యాట్స్ మెన్ నుంచి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఫలితంగా గ్లామోర్గాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి 81 పరుగుల తేడాతో ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..