టీ20 వరల్డ్‌‌కప్ జట్టులో చోటు దక్కలేదు.. కట్ చేస్తే.. 13 ఫోర్లు, 9 సిక్సర్లతో శతకొట్టాడు.. ఎవరో తెలుసా?

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభమైంది. ఈ టోర్నీలో టీమిండియా సీనియర్ ప్లేయర్లు, యువ ఆటగాళ్లు..

టీ20 వరల్డ్‌‌కప్ జట్టులో చోటు దక్కలేదు.. కట్ చేస్తే.. 13 ఫోర్లు, 9 సిక్సర్లతో శతకొట్టాడు.. ఎవరో తెలుసా?
Prithvi Shaw
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 14, 2022 | 5:52 PM

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభమైంది. ఈ టోర్నీలో టీమిండియా సీనియర్ ప్లేయర్లు, యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుతున్నారు. మొన్నటికి మొన్న రుతురాజ్ గైక్వార్డ్ సెంచరీతో ఆదరగొట్టగా.. ఇవాళ ఒకపక్క సీనియర్ ప్లేయర్ పుజారా అర్ధ సెంచరీతో.. పృథ్వీ షా అద్భుతమైన శతకొట్టి తమ జట్లకు అద్భుత విజయాలను అందించారు.

శుక్రవారం ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓపెనర్, కెప్టెన్ పృథ్వీ షా సెంచరీతో చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్సర్లతో 134 పరుగులు చేశాడు. ఫలితంగా ముంబై 61 పరుగుల తేడాతో అద్భుత విజయం అందుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఈ టీం స్కోర్‌లో 134 పరుగులు పృథ్వీ షా చేశాడంటే.. మొదటి బంతి నుంచే అతడి విధ్వంసం ఎలా ఉందో చెప్పొచ్చు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు షా.. ప్రతీ బంతిని బౌండరీకి తరలిస్తూ.. స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైశ్వాల్‌(42) షాకు సహకారం అందించడంతో వీరిద్దరి మధ్య సెంచరీ పార్టనర్‌షిప్ నెలకొంది. అస్సాం బౌలర్లలో రియాన్‌ పరాగ్‌, రోషన్‌ అస్లామ్‌, రాజ్‌కుద్దీన్‌ అహ్మద్‌లు తలో వికెట్‌ తీశారు.

అటు 231 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన అస్సాం జట్టు.. 169 పరుగులకే ఆలౌట్ అయింది. రాజ్జకుద్దిన్ అహ్మద్(39) ఒక్కడే టాప్ స్కోరర్. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 3 వికెట్లు, హకీమ్ ఖాన్, తనుశ్, షామ్స్ చెరో 2 వికెట్లు తీయగా.. పృథ్వీపాల్ ఒక వికెట్ తీశాడు.

కాగా, పృథ్వీ షా.. ఈ సెంచరీతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాళ్ల లిస్టులో చేరాడు. ఈ జాబితాలో శ్రేయాస్‌ అయ్యర్‌(147) అగ్రస్థానంలో, పునిత్‌ బిస్త్‌(146), మహ్మద్‌ అజారుద్దీన్‌(137) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. పృథ్వీ షా(134)తో నాలుగో స్థానంలో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..