Asia Cup 2025: ‘ఈ ట్రోఫీ మాకొద్దు’.. ఏసీసీకి సూర్యకుమార్ మాస్ వార్నింగ్.. ఎందుకంటే?

Suryakumar Yadav, Asia Cup 2025: "హ్యాండ్ షేక్" వివాదం తర్వాత, ఆసియా కప్‌లో కొత్త ట్విస్ట్ వెలువడింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా క్రికెట్ కౌన్సిల్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీని ట్రోఫీ ప్రజెంటేషన్ నుంచి తొలగించాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Asia Cup 2025: ఈ ట్రోఫీ మాకొద్దు..  ఏసీసీకి సూర్యకుమార్ మాస్ వార్నింగ్.. ఎందుకంటే?
Surya Kumar Yadav

Updated on: Sep 17, 2025 | 12:32 PM

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) మధ్య కొనసాగుతున్న వివాదం ఆసియా కప్‌ను తీవ్ర ఉద్రిక్తత స్థితిలోకి నెట్టివేసింది. టోర్నమెంట్ భవిష్యత్తుపై అనేక అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఆదివారం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య “హ్యాండ్ షేక్” సంఘటనగా ప్రారంభమైన త్వరగా పూర్తి స్థాయి దౌత్య, రాజకీయ సంక్షోభంగా మారింది. దీంతో పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామంటూ బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలో పీసీబీ కొన్ని షరతులను ఐసీసీ నెరవేర్చినప్పటికీ మీడియా వర్గాల ప్రకారం కొన్ని కొత్త సందేహాలు పుట్టుకొచ్చాయని తెలుస్తోంది.

టోర్నమెంట్ లో కొన్ని అంశాలపై భారత్, పాకిస్తాన్ రెండూ ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు కొన్ని అభ్యర్థనలు చేశాయని విశ్వసనీయంగా తెలిసింది. ఆండీ పైక్రాఫ్ట్ తొలగింపునకు సంబంధించిన పీసీబీ అభ్యర్థన విషయానికొస్తే, పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ (PAK vs UAE) మ్యాచ్‌కు రిచీ రిచర్డ్‌సన్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించడానికి ఐసీసీ అంగీకరించింది. అయితే, తరువాతి దశల్లో పాకిస్తాన్ మ్యాచ్‌లలో పైక్రాఫ్ట్ అంపైరింగ్ చేయడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

ఇవి కూడా చదవండి

అందువల్ల ప్రస్తుత పరిస్థితి ఇంకా పరిష్కారం కాలేదు. టోర్నమెంట్‌లో పాకిస్తాన్ భాగస్వామ్యం కొనసాగుతుందని నిర్ధారించే ప్రకటనను మొహ్సిన్ నఖ్వీ చేస్తారని భావిస్తున్నారు. అయితే అతను దాని ఆందోళనలను పునరుద్ఘాటించాలని కూడా నిర్ణయించుకోవచ్చు.

మైదానంలో అకస్మాత్తుగా ‘కరచాలనం చేయకూడదని’ తీసుకున్న నిర్ణయం నఖ్వీని కలత చెందేలా చేశాయనిసంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకవేళ ప్రోటోకాల్ ముందే నిర్ణయిస్తే ఆయన దానికి అంగీకరిస్తారు. అయితే, టోర్నమెంట్ మిగిలిన భాగంపై భయాలు ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమే కాదని తెలుస్తోంది.

భారత జట్టు ఫైనల్లో విజయం సాధిస్తే, ఆసియా కప్ ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ అయిన నఖ్వీ చేతుల మీదుగా భారత్ అందజేయడం తనకు ఇష్టం లేదని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందేశం ACCకి కూడా అందజేసినట్లు తెలుస్తోంది.

టోర్నమెంట్ తర్వాత మైదానంలో ఇబ్బంది పడకుండా ఉండటానికి పాకిస్తాన్ కూడా ముందుగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..