AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యకు బిగ్ షాక్.. కెప్టెన్‌గానే కాదు.. అసలు టీమ్‌లోనే ఉండడు? ఎందుకంటే..?

టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. వరల్డ్ కప్, ఐపీఎల్ 2026లోనూ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతని కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కూడా ప్రమాదంలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

సూర్యకు బిగ్ షాక్.. కెప్టెన్‌గానే కాదు.. అసలు టీమ్‌లోనే ఉండడు? ఎందుకంటే..?
Suryakumar Yadav
SN Pasha
|

Updated on: Jun 04, 2026 | 11:10 AM

Share

సాధారణంగా ఏ టీమ్ అయినా టీ20 వరల్డ్ కప్ గెలిస్తే ఆ టీమ్ కెప్టెన్‌కు మరో టీ20 వరల్డ్ కప్ వచ్చేంత వరకు అతని ప్లేస్‌కు ఢోకా ఉండదని అనుకుంటారు. కానీ ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కెప్టెన్‌గా కప్పు కొట్టి.. మచ్చుకు మూడు నెలలైనా కాలేదు, అప్పుడే అతన్ని కెప్టెన్సీ నుంచి తీసేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. నిజానికి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఈ గుసగుసలు వినిపించినా.. ఐపీఎల్ తర్వాత మరింత బలంగా వినిపిస్తున్నాయి.

అందుకు ప్రధాన కారణం సూర్య ఫామ్‌లో లేకపోవడం. టీ20 వరల్డ్ కప్‌ 2026లో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ అందులో సూర్య బ్యాట్‌తో చేసిన కాంట్రిబ్యూషన్ పెద్దగా ఏం లేదు. 8 మ్యాచ్‌ల్లో 242 పరుగులు చేశాడు. అందులో 84 పరుగులు పసికూన అమెరికాపై కొట్టాడు. అది తప్పితే సూర్య బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు రాలేదు. ఏదో కెప్టెన్‌గా ఉన్నాడని జట్టులో ఉంటున్నాడు కానీ లేదంటే అసలు ప్లేయింగ్‌లో ఉండాల్సిన ప్లేయర్ కాదంటూ సోషల్ మీడియాలో సూర్యపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సర్లే సూర్య ఆడకపోయినా.. జట్టు వరల్డ్ కప్ గెలిచింది కదా పోనీలే అనుకుంటే. ఐపీఎల్‌ 2026లో కూడా అదే చెత్త ఫామ్ కంటిన్యూ చేశాడు.

తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో సూర్య 13 మ్యాచ్‌లు ఆడి చేసింది కేవలం 270 పరుగులు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్‌లు మినహాయిస్తే.. మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ సూర్య దారుణంగా విఫలం అయ్యాడు. పైగా సూర్య టీమిండియాలో ఆడేది వన్ డౌన్ లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. అవి చాలా కీలకమైన స్థానాలు. ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేయాలి, లేదా త్వరగా అవుట్ అయితే ఇన్సింగ్స్ నిలబెట్టే బాధ్యత తీసుకోవాలి. అలాంటి కీ ప్లేస్‌‌లో ఆడుతూ రన్స్ చేయలేకపోతే జట్టుకు భారంగా మారతాడు. పైగా కెప్టెన్‌‌గా ఉంటూ అలా విఫలం అవుతూ ఉంటే టీమ్‌పై చాలా నెగిటివ్ ప్రభావం పడుతుంది. అందుకే సూర్యను కెప్టెన్సీ నుంచే కాక ఏకంగా టీ20 టీమ్ నుంచే తప్పించాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. మరి అదే జరిగితే ఇక సూర్య కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్లే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us