HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ రద్దు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

|

Feb 14, 2023 | 9:18 PM

తరచూ వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తుండే.. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. హెచ్‏సీఏ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ..

HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ రద్దు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
Supreme Court Of India
Follow us on

తరచూ వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తుండే.. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. హెచ్‏సీఏ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని నియమించింది. హెచ్‌సీఏ వ్యవహారాలు, కార్యకలాపాలు అన్నీ కొత్త కమిటీనే చూసుకుంటుందని స్పష్టం చేసింది. హెచ్‌సీఏ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించాలని సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ దవే కోర్టును కోరారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు గతంలో ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (IOA) కోసం ఎలక్టోరల్‌ కాలేజీని ఖరారు చేసే ప్రక్రియను పర్యవేక్షించారని, ఇప్పటికే ఐఓఏ ముసాయిదా రాజ్యాంగాన్ని పర్యవేక్షిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

కాగా.. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను నడిపిస్తున్నారు టికెట్ల కోసం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భారీ సంఖ్యలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. దీనిపై రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అజారుద్దీన్ కలిశారు. తొక్కిసలాట సందర్భంగా జరిగిన పరిణామాలను వివరించారు. తాజాగా సుప్రీంకోర్టు కమిటీని రద్దుచేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం