Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఫిట్‌నెస్ కోసం భారత ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు.. స్టింగ్ ఆపరేషన్‌లో చీఫ్ సెలక్టర్ సంచలన ఆరోపణలు..

Chetan Sharma: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన ఆరోపణలపై బీసీసీఐలోనూ, ఆటగాళ్లలోనూ అందోళనలు మొదలయ్యాయి.

Team India: ఫిట్‌నెస్ కోసం భారత ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు.. స్టింగ్ ఆపరేషన్‌లో చీఫ్ సెలక్టర్ సంచలన ఆరోపణలు..
Chetan Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Feb 15, 2023 | 7:30 AM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన ఆరోపణలపై బీసీసీఐలోనూ, ఆటగాళ్లలోనూ అందోళనలు మొదలయ్యాయి. గాయపడిన చాలా మంది భారత ఆటగాళ్లు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇంజెక్షన్లు తీసుకుంటారని చేతన్ శర్మ ఆరోపించారు. ఇటీవలే మళ్లీ నియమితులైన చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఓ ప్రైవేట్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాలు వెల్లడించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో, చేతన్ శర్మ జస్ప్రీత్ బుమ్రా గాయం గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆటగాళ్లకు జట్టు నుంచి తొలగిస్తారేమోననే భయం గురించి కూడా చెప్పుకొచ్చాడు.

గత ఒకటి, రెండేళ్లుగా భారత క్రికెట్ జట్టులోని ఆటగాళ్ల ఫిట్‌నెస్ చాలా ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా గత సంవత్సరంలో, టీమిండియాలో చాలా మంది సీనియర్ నుంచి కొత్త ఆటగాళ్లు గాయపడటం, దీని కారణంగా చాలా మ్యాచ్‌లు మిస్ అయిన సంగతి తెలిసిందే. జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత కూడా కొందరు ఆటగాళ్లు గాయాలపాలవుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ఎందుకు తక్కువగా ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా చేతన్ శర్మ ఒక ప్రైవేట్ ఛానెల్ స్టింగ్‌లో ఈ ఆరోపణలను వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

చేతన్ శర్మ ఆరోపణల్లో కీలక అంశాలు..

  1. అన్‌ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు తమను తాము పూర్తిగా ఫిట్‌గా చూపించుకోవడానికి నకిలీ ఇంజెక్షన్లు తీసుకుంటారు.
  2. పెయిన్ కిల్లర్లు ఇంజెక్షన్లు తీసుకోరు. ఎందుకంటే దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి. డోపింగ్‌లో పట్టుబడవచ్చు.
  3. డోప్ టెస్ట్‌లో కూడా పట్టుకోలేని ఇలాంటి ఇంజెక్షన్లు డాక్టర్లను పిలిపించి తీసుకుంటారు.
  4. జస్ప్రీత్ బుమ్రాకు పెద్ద గాయమైంది. అతను మరో మ్యాచ్ ఆడి ఉంటే, అతను ఏడాది పొడవునా దూరంగా ఉండేవాడు.
  5. ప్రతి ఆటగాడు జట్టు నుంచి తొలగించబడే ప్రమాదం ఉంది. అందుకే వారు ఇంజెక్షన్ ద్వారా తమను తాము ఫిట్‌గా ఉంచుకుంటారు.
  6. జట్టులో చేరిన తర్వాత ఏ ఆటగాడు కూడా ఆ స్థానాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. దీని కోసం చాలాసార్లు, పూర్తి ఫిట్‌నెస్ లేనప్పటికీ, వారు ఇంజెక్షన్ల ద్వారా తాము ఫిట్‌గా ఉన్నారని ప్రకటిస్తుంటారు.
  7. సంజూ శాంసన్ విషయంలో సెలక్టర్లు ఒత్తిడిలో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..