Video: వార్నీ.. ఇలా కూడా టాస్ వేస్తారా.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న వీడియో..

Canterbury Captain Frances Mackay Unique Way of Toss: అయితే, టాస్‌లో కొత్త పద్ధతిని అనుసరించడం మాత్రం ఫ్రాన్సిస్‌కు కలసిరాలేదు. ఆమె జట్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. తొమ్మిది పరుగులు చేసిన తర్వాత ఫ్రాన్సిస్ ఔటైంది. జట్టులోని నలుగురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరుకు చేరుకోగలిగారు. కేట్ అండర్సన్ 23, మడేలిన్ పెనా 25, లియా తహుహు 11, మెలిస్సా బ్యాంక్స్ 17 పరుగులు చేశారు. వెల్లింగ్టన్ బౌలర్లలో అమిలా కర్ ఐదు వికెట్లు పడగొట్టింది.

Video: వార్నీ.. ఇలా కూడా టాస్ వేస్తారా.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న వీడియో..
Super Smash Women T20 Leagu

Updated on: Jan 12, 2024 | 5:35 PM

Canterbury Captain Frances Mackay Unique Way of Toss: మహిళల టీ20 టోర్నీ సూపర్ స్మాష్ లీగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతోంది. జనవరి 11న జరిగిన ఈ మ్యాచ్‌లో జరిగిన టాస్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ విచిత్రంగా జరిగింది. కాంటర్‌బరీ వర్సెస్ వెల్లింగ్టన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కాంటర్‌బరీకి ఫ్రాన్సిస్ మాకే కెప్టెన్‌గా ఉంది. టాస్‌ సమయంలో మాకీ చేసిన పని వార్తల్లో నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఆమె జట్టు 47 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. 20 ఓవర్లు ఆడిన కాంటర్బరీ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఆమె కెప్టెన్సీ మాత్రం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

నాణెన్ని విసిరిన కెప్టెన్..

సాధారణంగా కెప్టెన్ టాస్ సమయంలో నాణెంపైకి విసిరేస్తుంటారు. కానీ ఫ్రాన్సిస్ అలా చేయలేదు. బదులుగా ఆమె నాణెంను గట్టిగా నేలకేసి కొట్టింది. నాణెం ఎగిరిపోయి చాలా దూరం వెళ్లింది. ఫ్రాన్సిస్ చేసిన ఈ చర్య చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు చేశావని ఫ్రాన్సిస్‌ని ప్రశ్నించగా.. గతకొన్ని మ్యాచ్‌ల్లో పరిస్థితులు తనకు అనుకూలంగా జరగడం లేదని, అందుకే పరిస్థితి తనకు అనుకూలంగా మారుతుందనే ఆశతో ఇలా చేశానంటూ చెప్పుకొచ్చింది. టాస్ వెల్లింగ్టన్‌కు అనుకూలంగా వెళ్లింది. ఆ జట్టు కెప్టెన్ అమిలా కర్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

మ్యాచ్ గెలవలేదు..

అయితే, టాస్‌లో కొత్త పద్ధతిని అనుసరించడం మాత్రం ఫ్రాన్సిస్‌కు కలసిరాలేదు. ఆమె జట్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. తొమ్మిది పరుగులు చేసిన తర్వాత ఫ్రాన్సిస్ ఔటైంది. జట్టులోని నలుగురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరుకు చేరుకోగలిగారు. కేట్ అండర్సన్ 23, మడేలిన్ పెనా 25, లియా తహుహు 11, మెలిస్సా బ్యాంక్స్ 17 పరుగులు చేశారు. వెల్లింగ్టన్ బౌలర్లలో అమిలా కర్ ఐదు వికెట్లు పడగొట్టింది. కాంటర్‌బరీ జట్టు ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం రెండింటిని మాత్రమే గెలవగలిగింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..