మొదటి సీరిస్‌లోనే 4 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్.. టెస్టు ఎంట్రీ ఇచ్చి నేటికి 50 ఏళ్లు.. క్రికెట్ లెజెండ్‌ను సత్కరించిన బీసీసీఐ..

Sunil Gavaskar : ‘లిటిల్ మాస్టర్’గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ గవాస్కర్ టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన మొదటి క్రికెటర్. ఈ సందర్భంగా

మొదటి సీరిస్‌లోనే 4 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్.. టెస్టు ఎంట్రీ ఇచ్చి నేటికి  50 ఏళ్లు.. క్రికెట్ లెజెండ్‌ను సత్కరించిన బీసీసీఐ..
Follow us
uppula Raju

| Edited By: Balaraju Goud

Updated on: Mar 06, 2021 | 4:38 PM

Sunil Gavaskar : ‘లిటిల్ మాస్టర్’గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ గవాస్కర్ టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన మొదటి క్రికెటర్. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ టెస్టు ఎంట్రీ ఇచ్చి నేటికి 50 ఏళ్లు గడిచాయి. 1971లో వెస్టిండీస్‌ పై ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరిస్‌లోనే 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. 154.80 సగటుతో 774 పరుగులు చేసి సంచలనం క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా 71 ఏళ్ల సునీల్ గవాస్కర్, తన టెస్టు ఎంట్రీ గురించి మాట్లాడాడు.‘నా దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల నెరవేరిన రోజు అది. విండీస్ గ్రేటెస్ట్ కెప్టెన్ సర్ గ్యారీ సోబర్స్‌ జట్టుతో మ్యాచ్ ఆడుతున్నందుకు కొంచెం ఒత్తిడికి లోనయ్యాను.

అందుకే సింక్‌లోకి రావడానికి చాలా సమయం పట్టింది. నాకు నేను మూర్ఖంగా అవుట్ అయ్యానని అనిపించకూడదని అనుకున్నా.. అప్పుడు కెప్టెన్‌గా అజిత్ వాడేకర్ ఉన్నారు. ఫస్ట్ సిరీస్‌లో 350, 400 పరుగులు చేసినా సంతృప్తి పడవచ్చని భావించా అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ చేసిన 774 పరుగులు, ఇప్పటికీ ఆరంగ్రేటం టెస్టు సిరీస్‌లో ఓ క్రికెటర్‌ చేసిన అత్యధిక పరుగులుగా రికార్డుల్లో నిలిచిపోయాయి… విండీస్ అరవీర భయంకర బౌలర్లు జెఫ్ థామస్, డెన్నిస్ లిల్లీ, మైఖేల్ హోల్డింగ్, మాల్మోమ్ మార్షల్, పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో ఆడినప్పుడు కూడా సునీల్ గవాస్కర్ ఎప్పుడూ హెల్మెట్ ధరించలేదు.

టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో మూడు సార్లు సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. రిటైర్మెంట్ సమయానికి అత్యధిక టెస్టు పరుగులు, అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు… కెరీర్‌లో 125 టెస్టులు ఆడిన సునీల్ గవాస్కర్, 10,122 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 108 వన్డేల్లో 3092 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్, ఓ వన్డే శతకం సాధించాడు. లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్ టెస్టు ఎంట్రీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్. ‘50 ఏళ్ల క్రితం ఈరోజున ఆయన క్రికెట్ ప్రపంచంలో ఓ సునామీ సృష్టించారు. ఆరంగ్రేటం సిరీస్‌లో 774 పరుగులు చేసి, నా లాంటి ఎందరికో హీరోగా మారాడని కొనియాడారు.

గవాస్కర్ మాస్టర్ ఇన్నింగ్స్ కారణంగా ఇండియా, వెస్టిండీస్‌లో విజయం సాధించింది, ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో కూడా. ఒక్కసారిగా ఇండియాలో క్రీడలకు కొత్త అర్థం వచ్చింది. చిన్నతనం నుంచి నేను ఆయన్ని చూస్తూ, ఆయనలా కావాలని కలలు కన్నాను. ఇప్పటికీ అందులో ఎలాంటి మార్పు లేదు. అతను ఎప్పుడూ నా హీరోనే. విష్ యూ హ్యాపీ 50వ ఇంటర్నేషనల్ క్రికెట్ మిస్టర్ గవాస్కర్ అంటూ ట్వీట్ చేశాడు. 1971 జట్టులో ఉన్న అందరికీ 50వ వార్షికోత్సవ అభినందనలు. మీరందరూ మమ్మల్ని గర్వపడేలా చేసి, వెలుగును చూపించారు…’ అంటూ రాసుకొచ్చాడు సచిన్ టెండూల్కర్. క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత కామెంటరీని కెరీర్‌గా ఎంచుకున్న సునీల్ గవాస్కర్, స్టార్ కామెంటేటర్‌గా ఎదిగారు. టీమిండియా ఆడే ప్రతీ సిరీస్‌లోనూ సునీల్ గవాస్కర్ కామెంటరీ ఉండాల్సిందే అనేంతగా మారిపోయింది పరిస్థితి.

మార్చిలో ఇల్లు కట్టుకునేవారికి బంపర్ ఆఫర్.. . గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన ఐసీఐసీఐ.. ఎంత తగ్గించిందంటే..