- Telugu News Photo Gallery Sports photos 50 years since legendary sunil gavaskar debut heres a look at key toi about cricket and life
Legendary Sunil Gavaskar Debut: భారత క్రికెట్ దిగ్గజం సన్నీ అరంగేట్రానికి 50 ఏళ్లు పూర్తి..
Legendary Sunil Gavaskar : భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కెరీర్ హిస్టరీలో మార్చి 6తో ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే రోజున తన క్రికెట్ జీవితాన్ని ఆరంభించాడు సన్నీ.
Updated on: Mar 06, 2021 | 1:15 PM

1971 మార్చి 6.. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు రెండో టెస్టు ఆడేందుకు రెడీ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కు వచ్చిన 21 ఏళ్ల కుర్రాడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

ఈ అయిదున్నర అడుగుల బ్యాట్స్‌మన్‌కు అదే మొదటి టెస్టు. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఓపెనర్‌గా హాఫ్ సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తన అరంగేట్ర సిరీస్‌లోనే భీకర విండీస్ బౌలర్లను ఎదుర్కొని 774 పరుగులతో రికార్డును నెలకొల్పాడు. ఇక అక్కడి నుంచి తనకు రికార్డులు మిత్రులుగా మారిపోయాయి.

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తన క్రికెట్ అరంగేట్రానికి నేటితో 50 ఏళ్లు పూర్తి. 71 ఏళ్ల సన్నీ ...భారత క్రికెట్‌తో నా ప్రయాణం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోందంటే సంతోషంగా ఉంది.

ఈ అయిదు దశాబ్దాల కాలంలో ఆటకు సంబంధం ఉన్న ఎన్నో పాత్రలు పోషించా. అరంగేట్ర టెస్టు మ్యాచ్ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగా ఉన్నాయి.

ఈ అయిదు దశాబ్దాల కాలంలో ఆటకు సంబంధం ఉన్న ఎన్నో పాత్రలు పోషించా. అరంగేట్ర టెస్టు మ్యాచ్ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగా ఉన్నాయి.

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సరిగ్గా 50 ఏళ్లు పూరి చేసుకున్న సందర్భంగా బీసీసీఐ సన్మానించుకుంది.




