మార్చిలో ఇల్లు కట్టుకునేవారికి బంపర్ ఆఫర్.. . గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన ఐసీఐసీఐ.. ఎంత తగ్గించిందంటే..
ICICI Bank Home Loan Rates : సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారికి గృహ రుణాలకు ఈ నెల సరైన అవకాశాలున్నాయి. తాజాగా
ICICI Bank Home Loan Rates : సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారికి గృహ రుణాలకు ఈ నెల సరైన అవకాశాలున్నాయి. తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు సైతం గృహ రుణాలపై వడ్డీ రేట్లను 6.70 శాతానికి తగ్గించింది. తాజా వడ్డీ రేట్లు గత పదేళ్లలో అతి తక్కువ అని, సవరించిన కొత్త రేట్లు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు ప్రకటించింది. సవరణ రేట్లు రూ. 75 లక్షల వరకు గృహ రుణాల కోసం వినియోగదారులు ప్రయోజనాలను పొందవచ్చని, రూ. 75 లక్షలకు పైన గృహ రుణాలకు 6.75 శాతం వడ్డీ రేటు వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది. ఈ అవకాశం మార్చి 31 వరకు వర్తిస్తాయని పేర్కొంది.
బ్యాంకు కస్టమర్లతో పాటు ఇళ్లను కొనాలనుకునేవారు బ్యాంకు వెబ్‌సైట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా గృహ రుణాల కోసం డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చని బ్యాంకు వెల్లడించింది. ‘గత కొన్ని నెలలుగా సొంత ఇళ్లను కోరుకునేవారి నుంచి గృహ రుణాలకు డిమాండ్ పుంజుకుంది. ఇది వారికి సరైన సమయం. ప్రస్తుతం ఉన్న తక్కువ వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకొని ఇళ్లను కొనుగోలు చేయొచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ సెక్యూర్డ్-అసెట్స్ హెడ్ రవి నారాయణన్ తెలిపారు.
కాగా, తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా తమ ఖాతాదారులకు గృహ రుణాలపై వడ్డీ రేట్లను 0.05 శాతం మేర తగ్గించింది. ఖాతాదారుల క్రెడిట్ చరిత్ర ఆధారంగా, తీసుకునే రుణ మొత్తంతో సంబంధం లేకుండా కొత్త రుణాలకు 6.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు కూడా రుణ రేట్లను తగ్గించాయి. వరుసగా 6.7%, 6.65 శాతానికి రుణాలు అందిస్తున్నాయి. గృహ రుణాలపై రిటైల్ ప్రైమ్ రుణ రేటు (ఆర్‌పీఎల్‌ఆర్)ను కూడా 0.05 శాతం మేర తగ్గిస్తున్నట్లు, దీంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న ఖాతాదారులకు కూడా వడ్డీ రేటు ఈ మేరకు తగ్గుతుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.