Gold and Silver Price: బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? నిపుణులు చెబుతున్న కీలక విషయాలు మీకోసం..

Gold and Silver Price: దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఘనణీయంగా తగ్గుతున్నాయి. వరుసగా వారంతపు రోజులైన..

Gold and Silver Price: బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? నిపుణులు చెబుతున్న కీలక విషయాలు మీకోసం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 06, 2021 | 4:20 PM

Gold and Silver Price: దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఘనణీయంగా తగ్గుతున్నాయి. వరుసగా వారంతపు రోజులైన శుక్రవారం శనివారాల్లో పసిడి ధరలు మరింత పడిపోయాయి. ఇక తాజాగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 1200 తగ్గి రూ. 45,300 లకు చేరుకుంది. మరోవైపు వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. తాజాగా వెండి ధర రూ. 3 వేలు క్షీణించింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 66,500 పలుకుతోంది. ఇక బంగారం ధరల పతనం గత పది నెలల్లో అత్యల్పంగా పరిగణించవచ్చునని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.

గతేడాది మే 7వ తేదీ నుంచి ఇప్పటి బంగారం ధరలు.. గత ఏడాది మే 7వ తేదీన దేశీయంగా బంగారం ధరలు తొలిసారి రూ. 45,000 మార్క్‌ను దాటింది. ఆ తరువాత బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే వస్తున్నాయి. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో దిగుమతి సుంకం తగ్గిస్తున్న ప్రకటించింది. దీని ప్రభావం కూడా బంగారం ధరలు తగ్గుదలపై పడినట్లు నిపుణులు చెబుతున్నారు. గడిచిన రెండు వారాల లెక్కలు చూసినట్లయితే.. రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో పసిడి ధరలు వరుసగా పతనమవుతూ వస్తున్నాయి. ఏకంగా రూ. 46,000 దిగువకు చేరుకుని రూ.45,500 వద్ద ట్రేడ్ అవుతోంది.

బంగారం ధరలు మరింత తగ్గుతాయా? రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ధరలు కూడా భారీగా తగ్గతుండటంతో ఆభరణాల కొనుగోలుకు ఇదే మంచి సమయం అని నిపుణులు చెబుతున్నారు. గత ఆగస్టు నెలలో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 56,254తో మార్క్‌ రేట్‌ను రీచ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి వరుసగా తగ్గుతూ వచ్చి ప్రస్తుతం 45,000 వేల వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా రూ. 12,000 మేరకు పసిడి ధరలు పడిపోయాయి. ఇక సమీప భవిష్యత్‌లో పుత్తడి ధరలు మరింత పతనం అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు రూ. 42,000 లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక వెండి పరిస్థితి కూడా ఉంటుందని చెబుతున్నారు.

బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి? మోడీ ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 2.5 శాతం తగ్గించింది. దీని ప్రభావం పడిసి ధరలపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇక డాలర్ విలువ పతనం కూడా బంగారం ధరల క్షీణతకు ఒక కారణంగా చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. కానీ, ఇప్పుడు ఇండెక్స్ కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ధరల పతనం మాత్రం కొనసాగుతుంది. దానికి కూడా కారణం ఉందంటున్నారు షేర్ మార్కెట్ విశ్లేషకులు. పెట్టబడిదారులు ఇప్పటి వరకు బంగారం పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తికనబరిచేవారు. ఇప్పుడు.. బిట్‌కాయిన్, ఈక్విటీల వైపు ఆకర్షితులవుతుండటంతో దాని ప్రభావం పసిడి ధరలపై పడుతోంది. ఫలితంగా ధరలు వరుసగా తగ్గుముఖం పడుతుంది.

Also read:

Balayya slaps fan: మరోసారి అభిమానిపై చేయి చేసుకున్న బాలయ్య.. హిందూపురంలో సేమ్ సీన్ రిపీట్

మొదటి టెస్ట్‌లోనే 4 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్.. టెస్టు ఎంట్రీ ఇచ్చి నేటికి 50 ఏళ్లు.. క్రికెట్ లెజెండ్‌ను సత్కరించిన బీసీసీఐ..