AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balayya slaps fan: మరోసారి అభిమానిపై చేయి చేసుకున్న బాలయ్య.. హిందూపురంలో సేమ్ సీన్ రిపీట్

మరోసారి అభిమాని చెంప చెల్లుమనిపించారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ.  మూడు రోజులుగా హిందూపురంలో ఆమన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

Balayya slaps fan: మరోసారి అభిమానిపై చేయి చేసుకున్న బాలయ్య.. హిందూపురంలో సేమ్ సీన్ రిపీట్
Ram Naramaneni
|

Updated on: Mar 06, 2021 | 1:55 PM

Share

మరోసారి అభిమాని చెంప చెల్లుమనిపించారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ.  మూడు రోజులుగా హిందూపురంలో ఆమన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా 9వ వార్డు అభ్యర్థిని ఇంటికి వెళ్లారు బాలయ్య.  ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడుతుండగా…  అభిమాని వీడియో తీశాడు.  దీనిని గమనించిన బాలయ్య..  అభిమాని చెంప చెల్లుమనిపించారు. కాగా బాలయ్యకు కాస్త ఆవేశం ఎక్కువన్న విషయం తెలిసిందే. గతంలో కూడా రెండుసార్లు అభిమానులపై చేయి చేసుకున్నారు.

కాగా ప్రచారంలో బాలయ్య హాట్ కామెంట్స్ చేశారు. తనలా బూతులు ఎవరూ తిట్టరని.. మంత్రులు నోరు అదుపులో ఉంచుకుంటే మంచిదన్నారు. తనకు ఒక పని కాదని.. ఎన్నో పనులున్నాయని చెప్పారు. తాను ప్రజా సేవ చేస్తున్నానని, ఎవరైనా విమర్శిస్తే ఊరుకోనని చెప్పారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌ ఉంటూ పేద వర్గాలకు చేదోడుగా ఉంటున్నట్లు గుర్తు చేశారు.  సినిమాల్లో నటిస్తూ ప్రజలకు మంచి సందేశాలు చిత్రాలు తీస్తున్నట్లు చెప్పారు. తనకు సంస్కారం ఉందని.. అందుకే గౌరవిస్తున్నానని.. నోరు పారేసుకుంటే ఊరుకోనని హెచ్చరించారు.  రాష్ట్రాన్ని నడిపిస్తున్నది అధికారులు కాదు, మంత్రులు కాదని,  ఇసుక మాఫియా, మద్యం మాఫియానే నడుపిస్తోందని ఎద్దేవా చేశారు.

సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధి పక్కన పెట్టి వీడియో గేమ్ లు ఆడుకుంటారని తీవ్ర విమర్శలు చేశారు బాలయ్య . మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వరని విమర్శించారు.   ఇలా పాలన సాగించడం దారుణమన్న బాలయ్య.. ఒక్క మాఫియాకు ఒక్కో మంత్రిని ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు.  చంద్రబాబును బూతులు తిట్టేందుకు మాత్రమే ఒక మంత్రిని నియమించారని.. రెండేళ్లలో ఏం చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు.  అందుకే పోలీసులు, వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:

ఈ పంట వేస్తే.. సిరుల పంట.. 1 ఎకరంలో సాగు చేస్తే 30 కోట్లు… సాగు విధానం సహా పూర్తి వివరాలు

తాళి కట్టు శుభవేళ.. పురోహితుడు మిస్సింగ్.. దీంతో ఏం చేశారంటే..?