Viral News Telangana: తాళి కట్టు శుభవేళ.. పురోహితుడు మిస్సింగ్.. దీంతో ఏం చేశారంటే..?

పెళ్లంటే వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, ఇళ్లంతా బంధువులు, చుట్టాల హడావుడి..ఇక ప్రేమ పెళ్లిలో మాత్రం ఇవేవీ కనిపించవు..కొందరు లవర్స్‌ సంతకాల పెళ్లి చేసుకుంటే..

Viral News Telangana:  తాళి కట్టు శుభవేళ.. పురోహితుడు మిస్సింగ్.. దీంతో ఏం చేశారంటే..?
Follow us

|

Updated on: Mar 06, 2021 | 8:50 AM

పెళ్లంటే వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, ఇళ్లంతా బంధువులు, చుట్టాల హడావుడి..ఇక ప్రేమ పెళ్లిలో మాత్రం ఇవేవీ కనిపించవు..కొందరు లవర్స్‌ సంతకాల పెళ్లి చేసుకుంటే.. మరికొందరు ప్రేమికులు గుడిలోనో, ఆర్యసమాజ్ ‌లోనో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోతారు..అయితే, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రేమ జంట పెళ్లిలాంటిది మాత్రం గతంలో ఎప్పుడూ చూసిఉండరు.

అతనొక ప్రజాప్రతినిధి.. పేరు రవి నాయక్….అతని పుట్టిన రోజు సందర్బంగా ఓ శుభకార్యానికి పూనుకున్నారు. ఓ ప్రేమజంటకు పెళ్లి జరిపించి చిరకాలం గుర్తుండి పోయేలా చేశారు. ఎవరైనా పుట్టినరోజు అంటే.. ఖరీదైన కానుకలు ఇస్తారు….కానీ ఇతడు మాత్రం వారిద్దరినీ ఏకం చేసి దాంపత్య జీవితం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు మిత్రులు వీరి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అందరూ కలిసి కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లిలోని ఓ గుడికి చేరుకున్నారు. పెళ్లికి కావాల్సిన మంగళ సూత్రం, పూల దండలు అన్ని సమకూర్చారు. పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతుంది. అక్కడ అంతా హడావుడి తీరా…ముహూర్తం దగ్గర పడే సమయానికి పెళ్లి తతంగం నడిపించే పురోహితుడినే మరచిపోయారు.

దీంతో, ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవాల్సి వచ్చింది. చేసేది లేక, తెలిసిన అయ్యగారి కి ఫోన్ చేసి పెళ్ళి మంత్రాలు చదవాల్సిందిగా కోరారు. ఖంగుతిన్న అయ్యగారు పోనీలే పాపమంటూ తన తంతును ప్రారంభించారు. స్మార్ట్ మొబైల్ లో వీడియోలో మంత్రాలు చదువుతుంటే..ఇక్కడ ఇలా వధువు మెడలో మూడుముళ్లు వేశాడు వరుడు.

ఇదేదో బాగుందని మిత్రులు… పెళ్ళి చేసుకుంటున్న జంట భలే ముచ్చట పడ్డారు. భాజాబజంత్రీలు లేకపోవడంతో గుడి గంటలే వారి పెళ్ళికి మేళతాళాలయ్యాయి. అయ్యగారి మంత్రాలకు మిత్రులంతా తోడై అక్షింతలు వేసి వారిని ఆశీర్వదించారు.

ఇంకెందుకు ఆలస్యం పనిలో పనిగా మనం కూడా ఈ నూతన జంటను ఆశీర్వదిద్దాం…..మొబైల్ ఫోన్ లో. ……ఇక రాబోయే రోజుల్లో పెళ్లిళ్లు ఈ విధంగానే జరుగుతాయి కాబోలు……

Also Read:

భర్తలో లోపం ఉందంటాడు.. సంతానం కావాలంటే తాను చెప్పింది వినాలంటాడు.. కృష్ణా జిల్లాలో కంత్రీ డాక్టర్

అక్కడి పెట్రోల్ బంకుల్లో కొత్త తరహా మోసం.. మీటర్ “0”నే ఉంటుంది… కానీ.. మీరు కూడా ఇలా మోసపోతున్నారా..?

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ