India vs England 4th Test Live: టీమిండియా ఘన విజయం.. 3-1తో సిరీస్ కైవసం.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్
IND vs ENG: టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నింగ్స్ 25 పరుగులతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది.
India vs England: టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నింగ్స్ 25 పరుగులతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. అశ్విన్ వేసిన 54.5వ బంతికి లారెన్స్ (50) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కోహ్లీసేన 3-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
దీంతో.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు చేయగా.. భారత్ 365 పరుగులకు ఆలౌటైంది. 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పర్యటక జట్టు 135 రన్స్‌కే కుప్పకూలింది.
టీమిండియా 0-1తో వెనకబడి గెలిచిన సిరీసులు..
2-1(5) vs ఇంగ్లాండ్ 1972/73 2-1(3) vs ఆసీస్ 2000/01 2-1(3) vs శ్రీలంక 2015 2-1(4) vs ఆసీస్ 2016/17 2-1(4) vs ఆసీస్ 2020/21 3-1(4) vs ఇంగ్లాండ్ 2020/21
#TeamIndia complete an innings & 2⃣5⃣-run win as @ashwinravi99 picks up his 3⃣0⃣th five-wicket haul in Tests. ??
India bag the series 3-1 & march into the ICC World Test Championship Final. ??@Paytm #INDvENG
Scorecard ? https://t.co/9KnAXjaKfb pic.twitter.com/ucvQxZPLUQ
— BCCI (@BCCI) March 6, 2021
డెబ్యూమ్యాచ్‌నే అద్భుతం సృష్టించిన అక్షర్ పటేల్.. చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాడు. అరంగేట్రం సిరీసులో అత్యధిక వికెట్లు
27 అక్షర్ పటేల్ vs ఇంగ్లాండ్ 2020/21 26 అజంత మెండిస్ vs భారత్ 2008 24 అలెక్ బెడ్సర్ vs భారత్ 1946 22 అశ్విన్ vs వెస్టిండీస్ 2011/12 20 స్టువర్ట్ క్లార్క్ vs దక్షిణాఫ్రికా 2005/06
LIVE NEWS & UPDATES
-
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోకి…
ఈ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది.
A moment to cherish for #TeamIndia ????
ICC World Test Championship Final – Here we come ???@Paytm #INDvENG pic.twitter.com/BzRL9l1iMH
— BCCI (@BCCI) March 6, 2021
-
టీమిండియా 0-1తో వెనకబడి గెలిచిన సిరీసులు.. ఇంగ్లాండ్‌పై 1972 తర్వాతే ఇప్పుడే..
2-1(5) vs ఇంగ్లాండ్ 1972/73 2-1(3) vs ఆసీస్ 2000/01 2-1(3) vs శ్రీలంక 2015 2-1(4) vs ఆసీస్ 2016/17 2-1(4) vs ఆసీస్ 2020/21 3-1(4) vs ఇంగ్లాండ్ 2020/21
#TeamIndia complete an innings & 2⃣5⃣-run win as @ashwinravi99 picks up his 3⃣0⃣th five-wicket haul in Tests. ??
India bag the series 3-1 & march into the ICC World Test Championship Final. ??@Paytm #INDvENG
Scorecard ? https://t.co/9KnAXjaKfb pic.twitter.com/ucvQxZPLUQ
— BCCI (@BCCI) March 6, 2021
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా. జూన్ 18 నుంచి 22 వరకు లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడుతుంది.
-
-
భారత్ ఘన విజయం
టీమిండియా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఇన్నింగ్స్ 25 పరుగులతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. అశ్విన్ వేసిన 54.5వ బంతికి లారెన్స్ (50) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కోహ్లీసేన 3-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
-
మూడో రోజు రెండో సెషన్ మొదలు.. నిలకడగా ఇంగ్లాండ్..
ఇంగ్లాండ్ మూడో రోజు రెండో సెషన్ మొదలు పెట్టింది. 91/6తో టీ విరామానికి వెళ్లిన ఆ జట్టు బ్యాట్స్‌మెన్.. ఫోక్స్(8), లారెన్స్(21) తర్వాత కూడా నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 35 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 95/6గా నమోదైంది.
-
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో టీ విరామ సమయానికి 91/6తో నిలిచింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెన్‌ఫోక్స్(6), లారెన్స్(19) నిలకడగా ఆడుతున్నారు. కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఆదుకునే ప్రయత్నాలను మొదలు పెట్టారు. 65 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 33 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. మరోవైపు టీమ్‌ఇండియా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది.
-
-
6వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ కప్పగంతులు వేస్తోంది. ఇంగ్లాండ్ కీలక వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ వెనుదిరిగారు. అశ్విన్ వేసిన 26వ ఓవర్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్(30) వికెట్లు ముందు దొరికిపోయాడు.
-
పోప్ ఔట్…
ఇంగ్లాండ్ ఆటగాళ్లకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరస వికెట్లు కోల్పోతున్న ఇంగ్లీష్ట జట్టు 5వ వికెట్ పోప్ కోల్పోయింది.
-
పోప్ సిక్సర్
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 50 పరుగులు దాటింది. అశ్విన్ వేసిన 22వ ఓవర్‌లో పోప్ సిక్సర్ బాదడంతో ఆ జట్టు స్కోర్ 54కి చేరింది.
-
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ భారత క్రికెట్‌లో అడుగుపెట్టి నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ విశేషమైన సందర్భాన్ని పురస్కరించుకొని బీసీసీఐ అతడిని సత్కరించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు సందర్భంగా భోజన విరామంలో బీసీసీఐ సెక్రటరీ జై షా చేతుల మీదుగా గావస్కర్‌కు జ్ఞాపిక అందజేశారు.
Join me in celebrating the 50th anniversary of Shri Sunil Gavaskar Ji’s Test debut for ??. It is indeed a momentous occasion for all Indians and we are getting to celebrate it at the world’s largest cricket facility Narendra Modi Stadium ?️ @ICC @BCCI pic.twitter.com/NzolBqvKzI
— Jay Shah (@JayShah) March 6, 2021
-
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్ ఔట్..
టీమిండియా బౌలర్లు విజృంభిస్తుండడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు ఇంటిముఖం పడుతున్నారు. 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్(2) స్వీప్ షాట్ కోహ్లీ చేతికి చిక్కాడు.
-
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..
వేగంగా వికెట్లు కోల్పోతోంది ఇంగ్లాండ్.. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్ వేసిన 10వ ఓవర్ చివరి బంతికి సిబ్లీ(3) ఔటయ్యాడు.
-
లంచ్ విరామం తర్వాత రెండు వికెట్లు..
లంచ్ విరామం తర్వాత ఇంగ్లాండ్ వరుస వికెట్లను కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు టీమిండియా షాకిచ్చింది. అశ్విన్ బౌలింగ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. క్రాలే 5(16), బెయిర్‌స్టో0(1)లు పెవిలియన్‌కు చేరారు.
-
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 10/1 (4.4)
10/1 (4.4) తొలి వికెట్‌ను ఇంగ్లాండ్ జట్టు కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో తొలి వికెట్ కోల్పోయింది. క్రాలే 5(16) పెవిలియన్‌కు పంపించాడు.
-
భోజన విరామ తర్వాత మొదలైన ఆట..
లంచ్ బ్రేక్ తర్వాత ఆట మొదలైంది… క్రాలే(5), సిబ్లీ(1) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా 154 పరుగుల వెనుకంజలో ఉంది.
-
భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 6/0
భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 6/0తో కొనసాగుతోంది. అంతకు ముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటయ్యాక ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. లంచ్ బ్రేక్ సమయానికి ముందు 3 ఓవర్లలో ఆ జట్టు ఓపెనర్లు 6 పరుగులు చేశారు. క్రాలే(5), సిబ్లీ(1) క్రీజులో ఉన్నారు.
Published On - Mar 06,2021 4:40 PM