క్రికెట్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్.!! హైదరాబాద్‌కు నో ఛాన్స్.!

IPL 2021 Date And Schedule: క్రికెట్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి తాత్కాలిక షెడ్యూల్ బయటకొచ్చింది...

క్రికెట్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్.!! హైదరాబాద్‌కు నో ఛాన్స్.!
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 06, 2021 | 4:37 PM

IPL 2021 to start on April 9: క్రికెట్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి తాత్కాలిక షెడ్యూల్ బయటకొచ్చింది. కరోనా తగ్గిన నేపధ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు సిద్దమైంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 30 వరకు లీగ్ జరగనుంది. మొత్తం 52 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీలో 60 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. దీనిపై తాత్కాలికంగా నిర్ణయం తీసుకోగా.. అధికారిక ప్రకటన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత వెలువడనుంది.

ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ వేదికలుగా ఎంపిక చేయాలని చూస్తుండగా.. వీటిపై తుది నిర్ణయం వచ్చే వారం తీసుకోనుంది. ఫ్రాంచైజీల అభిప్రాయాలను సైతం సేకరించిన తర్వాత వేదికలపై అధికారిక ప్రకటన చేస్తామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఒకరు వెల్లడించాడు. అయితే దాదాపు హైదరాబాద్ వేదికగా ఏ మ్యాచ్ ఉండకపోవచ్చునని.. మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తామని చెప్పడంతో ముంబైలో లీగ్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందని సమాచారం. కాగా, అభిమానులకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తుండగా.. వేదికలు ఫైనల్ కావడం బట్టి బయోబబుల్ ఆంక్షలను సడలించనుందని తెలుస్తోంది.

ఇక మినీ వేలంలో ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్స్, ఆల్ రౌండర్లను తమ జట్లను బలపరుచుకోవడంలో భాగంగా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్లకు.. మ్యాక్స్ వెల్ రూ.14.25 కోట్లకు, జెమిసన్ రూ.15 కోట్లకు అమ్ముడుపోయిన విషయం విదితమే. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికారు.

Also Read:

Viral: ఇంటర్ స్టూడెంట్ అందమైన ప్రేమలేఖ.. అమ్మాయి రెస్పాన్స్ అదుర్స్.. అసలు ఏం చెప్పిందంటే.!

ఐపీఎల్ 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఈ ఐదుగురికి ప్లేస్ పక్కా.. వారెవరంటే.!

అదృష్టానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్.. ఒక్క దెబ్బతో కోట్లు గెలుచుకుంది.. అసలు మ్యాటర్ ఇదే.!