స్వ్కాడ్‌లో ఈ 15మంది ఉంటే చాలు.. వద్దన్నా 2027 వన్డే వరల్డ్ కప్ పట్టుకొచ్చేస్తారంతే..!

Sunil Gavaskar World Cup 2027 Squad: వన్డే ప్రపంచకప్ 2027 నాటికి టీమిండియా తుది జట్టు స్వరూపం ఎలా ఉంటుందనే దానికి గవాస్కర్ టీమ్ ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌లా కనిపిస్తోంది. ఈ లైనప్‌పై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ, ఐసీసీ ట్రోఫీ కలను నెరవేర్చుకునేందుకు ఇది ఎంతో పటిష్టమైన కాంబినేషన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

స్వ్కాడ్‌లో ఈ 15మంది ఉంటే చాలు.. వద్దన్నా 2027 వన్డే వరల్డ్ కప్ పట్టుకొచ్చేస్తారంతే..!
Sunil Gavaskar Comments On Team India

Updated on: Aug 06, 2026 | 10:26 AM

Sunil Gavaskar World Cup 2027 Squad: దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవస్కర్ ప్రకటించిన 15 మంది సభ్యుల డ్రీమ్ టీమ్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కుర్రాడు శుభ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన సన్నీ, జట్టులో ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు చోటు నిరాకరించి ఊహించని షాక్ ఇచ్చారు.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న 2027 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సంబరానికి క్రికెట్ ప్రపంచం సిద్ధమవుతోంది. మొత్తం 57 మ్యాచ్‌ల భారీ పోరాటానికి సమయం దగ్గరపడుతున్న వేళ, టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవస్కర్ తన అంచనాలతో కూడిన పవర్ ఫుల్ స్క్వాడ్‌ను ప్రకటించారు. అనుభవజ్ఞులు, కుర్రాళ్ల సమ్మేళనంతో రూపొందించిన ఈ జట్టు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, కొందరు సీనియర్ల అభిమానులకు మాత్రం నైరాశ్యాన్ని మిగిల్చింది.

ఇదికూడా చదవండి: Video: ఇలాంటి రనౌట్ ఇప్పటి వరకు చూసుండరు.. పట్టరాని కోపంతో కాలితో బంతిని తంతే..!

ఇవి కూడా చదవండి

గిల్ చేతికి సారథ్యం.. టాప్ ఆర్డర్‌లో రోహిత్, కోహ్లీ..

భారత జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం గవాస్కర్ డ్రీమ్ టీమ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలు జట్టులో ఉన్నప్పటికీ, గిల్‌కే నాయకత్వ బాధ్యతలు అప్పగించడం విశేషం. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌లకు స్థానం కల్పిస్తూ అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను సిద్ధం చేశారు.

వికెట్ కీపింగ్ బాధ్యతల విషయానికి వస్తే కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లను ఎంచుకున్నారు. అయితే, టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు ఈ 15 మంది సభ్యుల స్క్వాడ్‌లో చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇదికూడా చదవండి: రోహిత్‌నే తప్పిద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే.. అగార్కర్ పోస్ట్‌కే చెక్ పెట్టేసిన హిట్‌మ్యాన్.. నెక్ట్స్ బాస్‌గా తెలుగోడే..?

ఊహించని ఆల్రౌండర్లు.. ఆంధ్రా కుర్రాడికి దక్కిన పిలుపు..

ఆల్రౌండర్ల కోటాలో గవాస్కర్ ఏకంగా నలుగురు ఆటగాళ్లను రంగంలోకి దించారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాతో పాటు ఆంధ్రాకు చెందిన యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి చోటు కల్పించడం విశేషం. నితీష్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్‌గా జట్టు సమతుల్యతను పెంచుతాడని సన్నీ భావిస్తున్నారు.

స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్‌ను ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎంపిక చేశారు. అక్షర్, జడేజాల రూపంలో మరో ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉండటం వల్ల పిచ్ పరిస్థితులకు తగినట్లు జట్టును నడిపించడం సులువవుతుంది.

ఇదికూడా చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ ఎఫెక్ట్.. రెండుగా చీలిన బీసీసీఐ.. ప్రపంచకప్ 2027 రేసులో ఉంటాడా లేదా..?

సిరాజ్‌కు దక్కని చోటు.. పేస్ దళంలోకి హర్షిత్ రాణా..

బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మహమ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టడం మరో పెద్ద సంచలనంగా మారింది. పేస్ దళ నాయకుడిగా జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసిన గవాస్కర్, ఆయనకు తోడుగా మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాలకు స్థానం ఇచ్చారు.

మొత్తంగా పంత్, సిరాజ్ లాంటి మ్యాచ్ విన్నర్లు లేకపోయినప్పటికీ, అనుభవం నుంచి యంగ్ బ్లడ్ వరకు అన్ని కోణాల్లో సమతుల్యంగా ఉన్న గవాస్కర్ స్క్వాడ్ ప్రపంచకప్ రేసులో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us