IND vs AUS: ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌కు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కానున్నారా? కింగ్ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్‌లకు దూరంగా ఉండడమే ఇలాంటి ప్రశ్న తలెత్తడానికి ప్రధాన కారణంగా నిలిచింది. తిరువనంతపురంలో జరగాల్సిన రెండో వార్మప్ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ హఠాత్తుగా ముంబైకి చేరుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి తప్పుకున్న కోహ్లి.. టీమ్ ఇండియా ఫొటో షూట్ లోనూ కనిపించలేదు. అందుకే, ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండడంటూ వార్తలు వచ్చాయి.
కాగా, ఈ గందరగోళాలన్నింటికీ విరాట్ కోహ్లీ స్వయంగా తెరతీశాడు. బుధవారం చెన్నైలో అడుగుపెట్టిన టీమిండియా జట్టులో విరాట్ కోహ్లీ కూడా కనిపించాడు. దీని ద్వారా అక్టోబరు 8న జరిగే తొలి మ్యాచ్‌లో ఆడతానని ధృవీకరించాడు.
విరుష్క దంపతులు తమ 2వ బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. దీంతో కోహ్లి జట్టును మధ్యలోనే వదిలేసినట్లు సమాచారం. దీంతో అక్టోబరు 8న జరిగే మ్యాచ్‌కు కోహ్లి అందుబాటులో ఉండకపోవచ్చని అంటున్నారు.
కాగా, భారత జట్టుతో విరాట్ కోహ్లీ చెన్నైలో అడుగుపెట్టాడు. దీని ద్వారా ప్రపంచకప్‌లోని అన్ని మ్యాచ్‌ల్లోనూ పాల్గొంటాననే భరోసా ఇచ్చాడు.
BREAKING 🚨
Indian team lands in Chennai for their ODI World Cup opener vs Australia.@CricSubhayan & @debasissen report.@ThumsUpOfficial #INDvsAUS #ViratKohli #ICCCricketWorldCup pic.twitter.com/NetfdyLhGp
— RevSportz (@RevSportz) October 4, 2023
భారత్ వేదికగా జరగనున్న 13వ వన్డే ప్రపంచకప్ రేపటి నుంచి (అక్టోబర్ 5) ప్రారంభం కానుంది. 10 జట్ల మధ్య జరుగుతున్న ఈ క్రికెట్ పోరులో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 8న చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది.
ప్రపంచకప్‌లో టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
అక్టోబర్ 8: భారత్ vs ఆస్ట్రేలియా – చెన్నై
అక్టోబర్ 11: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ – ఢిల్లీ
అక్టోబర్ 14: భారత్ vs పాకిస్థాన్ – అహ్మదాబాద్
అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్ – పూణె
అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్ – ధర్మశాల
అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్ – లక్నో
నవంబర్ 2: భారత్ vs శ్రీలంక – ముంబై
నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా – కోల్‌కతా
నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్ – బెంగళూరు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..