250 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. కోల్‌కతా ఓపెనర్ తుఫాన్ ఇన్నింగ్స్.. అయినా తప్పని పరాజయం!

| Edited By: Anil kumar poka

Aug 30, 2021 | 8:57 PM

Caribbean Premier League: ఏ జట్టుకైనా బలమైన బ్యాట్స్‌మెన్ ఉంటే.. విజయం లాంఛనమే అవుతుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నెగ్గాల్సిన మ్యాచ్ ఓడిపోయింది.

250 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. కోల్‌కతా ఓపెనర్ తుఫాన్ ఇన్నింగ్స్.. అయినా తప్పని పరాజయం!
Tim Seifert
Follow us on

టీ20 క్రికెట్ అంటేనే మజా. ఇలాంటి లీగ్స్‌లో బౌలర్ల కంటే బ్యాట్స్‌మెన్లు ఎక్కువగా లాభపడతారు. కష్టతరమైన టార్గెట్లను సైతం సునాయాసంగా ఛేజ్ చేయడంతో పాటు.. అభిమానులకు కావల్సినంత వినోదాన్ని పంచిపెడతారు. ఇదిలా ఉంటే సాధారణంగా ఏ జట్టులోనైనా బలమైన బ్యాట్స్‌మెన్లు ఉంటే.. గెలుపు లాంఛనమే అని చెప్పాలి. అయితే ఇక్కడ ఓ జట్టు ఓటమిపాలైంది. అద్భుతమైన ప్రత్యర్ధి బౌలింగ్ ఆ జట్టుకు పరాజయాన్ని అందించింది. తాజాగా కరేబీయన్ లీగ్‌లో జరిగిన ఓ మ్యాచ్ దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇద్దరు న్యూజిలాండ్ ఓపెనర్లు ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించారు. అయితేనేం తమ టీంకు మాత్రం విజయాన్ని అందించలేకపోయారు. అదేంటో చూసేద్దాం పదండి.

ఆదివారం వార్నర్ పార్కర్ వేదికగా లూసియా కింగ్స్, త్రిన్బాగో నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(43), రోస్టన్ చేజ్(30) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. నైట్ రైడర్స్ బౌలర్లలో రామ్‌పాల్ మూడు వికెట్లు తీయగా.. సీల్స్, హోసేన్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇక 158 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన నైట్ రైడర్స్ జట్టుకు.. ఓపెనర్లు సిమన్స్(25), వెబ్‌స్టర్(18) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. అయితే ఆ తర్వాత వచ్చిన కొలిన్ మున్రో(40) యాంకర్ రోల్ పోషిస్తూ.. మిడిల్ ఓవర్‌లో నెమ్మదించిన స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన నైట్ రైడర్స్ జట్టును టిమ్ సిఫెర్ట్(40*) ఆదుకున్నాడు. లూసియా కింగ్స్ బౌలర్లకు చుక్కలు చూపించి విధ్వంసం సృష్టించాడు.

క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 16 బంతులు ఎదుర్కున్న టిమ్ సిఫెర్ట్ 250 స్ట్రైక్‌రేట్‌తో 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. మున్రోకు సహకారం తన జట్టుకు విజయాన్ని అందించాలని ప్రయత్నించాడు. అయితే చివరి ఓవర్‌లో లూసియా కింగ్స్ బౌలర్ వాహాబ్ రియాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో నైట్ రైడర్స్ జట్టు 5 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కుంది.

Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!

500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?