Telugu News Sports News Cricket news Srilanka vs Afghanistan match umpire wrong decision controversy over Nissankas dismissal netizens fire Telugu Cricket News
Asia Cup 2022: ఆరంభంలోనే వివాదం.. చెత్త అంపైరింగ్ అంటూ శ్రీలంక ఫ్యాన్స్ ఆగ్రహం.. అసలేం జరిగిందంటే?
SL vs AFG: ఎట్టకేలకు ఆసియా కప్ 2022 ప్రారంభమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వేదికగా జరిగిన ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి. అయితే టోర్నమెంట్ ప్రారంభంలోనే పెద్ద వివాదం చెలరేగింది.
SL vs AFG: ఎట్టకేలకు ఆసియా కప్ 2022 ప్రారంభమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వేదికగా జరిగిన ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి. అయితే టోర్నమెంట్ ప్రారంభంలోనే పెద్ద వివాదం చెలరేగింది. శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ రెండో ఓవర్‌లో అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేం చెత్త అంపైరింగ్, కళ్లుకనిపించడం లేదా అంటూ ఫ్యాన్స్ శాపనార్థాలు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్లుగానే మొదటి ఓవర్లోనే ఇద్దరు లంక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించి శుభారంభం అందించాడు ఫజ్ల్హాక్ ఫరూఖీ. అయితే 2 ఓవర్‌లోనే వివాదం నెలకొంది. నవీన్ ఉల్ హక్ వేసిన ఈ ఓవర్ చివరి బంతిని పాతుమ్ నిశాంకా కవర్స్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బాల్ అందకపోవడంతో నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్ కీపర్ కూడా క్యాచ్‌కు అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి వెంటనే ఔట్ అంటూ ప్రకటించాడు. దీంతో నిశాంక డీఆర్ఎస్ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ చాలాసార్లు రీప్లేలను చూసి స్నికోమీటర్ సహాయం తీసుకున్నాడు. అయితే స్నికోమీటర్‌లో ఎలాంటి స్పైక్ కనిపించలేదు. బంతి బ్యాట్‌కు దగ్గరగా మాత్రమే వెళ్లిందని, తాకలేదని స్పష్టంగా తేలింది. అయితే థర్డ్ అంపైర్ జయరామన్ మదన్‌గోపాల్ అనూహ్యంగా నిశాంకను ఔట్‌గా ప్రకటించాడు.
కాగా థర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంతో క్రీజులోని బ్యాటర్‌తో పాటు డగౌట్‌లో ఉన్న శ్రీలంక జట్టు మేనేజ్‌మెంట్ కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న శ్రీలంక కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ కోపంతో తన రెండు చేతులను గాలిలోకి పైకి లేపాడు. డగౌట్‌లో కూర్చున్న శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కూడా అంపైరింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీలంకకు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత రోషన్ అభయసింగ్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇది చాలా చెత్త నిర్ణయమని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంపై శ్రీలంక అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.