SRH vs RR Playing XI IPL 2022: తొలిపోరుకు సిద్ధమైన మాజీ ఛాంపియన్లు.. రాజస్థాన్, హైదరాబాద్ ప్లేయింగ్‌ XI ఎలా ఉండనుందంటే?

|

Mar 29, 2022 | 5:00 PM

SRH vs RR Playing 11 Prediction: వేలానికి ముందు హైదరాబాద్, రాజస్థాన్ తమ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఈ ముగ్గురు ఆటగాళ్లను తుది ప్లేయింగ్ XIలో చోటు...

SRH vs RR Playing XI IPL 2022: తొలిపోరుకు సిద్ధమైన మాజీ ఛాంపియన్లు.. రాజస్థాన్, హైదరాబాద్ ప్లేయింగ్‌ XI ఎలా ఉండనుందంటే?
Srh Vs Rr Playing Xi Ipl 2022
Follow us on

ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) ప్రారంభం అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో చివరి వరకు ఉత్కంఠగా కొనసాగింది. ఇప్పటివరకు మొత్తం 10 జట్లు తమ తొలి మ్యాచ్ ఆడలేదు. మార్చి 29, మంగళవారం పూణేలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH vs RR) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో, అన్ని జట్లకు ఒక్కో మ్యాచ్ పూర్తవుతుంది. IPL రెండు మాజీ ఛాంపియన్ జట్ల మధ్య ఈ మ్యాచ్‌పై ఎంతో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే వేలం తర్వాత రెండు జట్లూ బలహీనమైనవిగా పరిగణించారు. ఇలాంటి పరిస్థితుల్లో తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ (SRH vs RR Playing XI Prediction) ఏ ఆటగాళ్లతో మైదానంలోకి దిగనున్నాయో ఓసారి చూద్దాం.

గత సీజన్ తర్వాత రాజస్థాన్, హైదరాబాద్ చెరో ముగ్గురు ఆటగాళ్లను కలిగి ఉన్నాయి. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌లను రిటైన్ చేసుకుంది. గత సంవత్సరం వీరి ప్రదర్శనలు జట్టుకు ఎంతో కీలకంగా మారాయి. అదే సమయంలో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లను రిటైన్‌ చేసి హైదరాబాద్‌ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వేలంలో కూడా ఆ జట్టు కొన్ని పొరపాట్లు చేసి కీలక ప్లేయర్లను దక్కించుకోలేకపోయింది.

రిటైన్ చేసుకున్న వారికి చోటు..

మొదటి మ్యాచ్‌లో ఇరు జట్ల ప్లేయింగ్ XI గురించి మాట్లాడితే, మునుపటి సీజన్‌తో పోలిస్తే పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. అయితే, రెండు జట్లూ తమ తమ ముగ్గురు రిటైన్డ్ ఆటగాళ్లను ప్లేయింగ్ XIలో చేర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వీరే కాకుండా ఎవరికి అవకాశం వస్తుందనే దానిపైనే కన్నేసింది.

బ్యాలెన్స్‌గా రాజస్థాన్ జట్టు..

రాజస్థాన్ గురించి మాట్లాడితే, ఈసారి కూడా యశస్వి, బట్లర్ జోడి తెరుచుకుంటుంది. అయితే బెంగళూరు మాజీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌ను మూడవ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరితో పాటు బ్యాటింగ్‌లో షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్‌లకు తొలి మ్యాచ్‌లో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ కృష్ణల పేస్ అటాక్ కీలక బాధ్యత వహిస్తుంది. అయితే రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ రూపంలో జట్టు స్పిన్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది.

గతంలో కంటే మెరుగ్గా హైదరాబాద్ మిడిల్ ఆర్డర్..

మరోవైపు, హైదరాబాద్ గురించి మాట్లాడితే, కెప్టెన్ విలియమ్సన్‌ను ఓపెనింగ్‌లో చూడొచ్చు. యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ అతనితో అవకాశం పొందడం ఖాయంగా ఉంది. గత సీజన్‌లో కూడా ఇద్దరూ ఓపెనింగ్‌లో కనిపించారు. హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ గత సీజన్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, ఐదన్ మార్క్‌రామ్ ఈసారి ప్లేయింగ్ XIలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అదే సమయంలో, అబ్దుల్ సమద్‌పై కూడా నమ్మకం ఉంచనున్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ భుజాలపై జట్టు ఫాస్ట్ బౌలింగ్ ఆధారపడింది. వెటరన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేయడం హైదరాబాద్‌కు అతిపెద్ద సమస్యగా మారింది. తొలి మ్యాచ్‌లో రాయల్స్ మాజీ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్‌ను విశ్వసించవచ్చని భావిస్తున్నారు.

SRH vs RR Predicted Playing 11:

రాజస్థాన్ – సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ కౌల్టర్-నైల్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (వికెట్), ఐదన్ మర్క్రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, శ్రేయాస్ గోపాల్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.

Also Read: ఓవైపు సీనియర్ బౌలర్లు.. మరోవైపు 29కే 4 వికెట్లు డౌన్.. ఆడింది ఒకటే మ్యాచ్.. అయినా చుక్కలు చూపించిన బ్యాటర్

IPL 2022: బీసీసీఐ సంచలన నిర్ణయం.. అమలులోకి న్యూ రూల్స్.! ఆ విదేశీ క్రికెటర్లకు దిమ్మతిరిగే షాక్..