హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా గురువారం (మే17) జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ రద్దయ్యింది. భారీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే 15 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరుకుంది. మరోవైపు గుజరాత్ 12 పాయింట్లతో ఈ సీజన్ ను ముగించింది. కాగా ఎస్ఆర్‌హెచ్ గుజరాత్ మ్యాచ్ రద్దయ్యాక ఉప్పల్ స్టేడియంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ మాజీ ఆటగాడు, ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న కేన్ విలియమ్సన్‌తో ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ సరదాగా ముచ్చటించారు. ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా పలుకరించుకుని పరస్పరం యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా గతంలో సన్ రైజర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు విలియమ్సన్. అయితే యాజమాన్యం అతనిని వదులుకోవడంతో గుజరాత్ టైటాన్స్ కు వెళ్లిపోయాడు.
కేన్ మామ 2015 నుంచి 2022 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ జట్టు తరఫున మొత్తం 76 మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్ 36 సగటుతో 2101 పరుగులు చేశాడు. 18 అర్థ సెంచరీలు సాధించాడు. కెప్టెన్‌గానూ 46 మ్యాచ్‌ల్లో జట్టును ముందుండి నడిపించాడు. 2018 సీజన్‌లో జట్టును ఫైనల్‌కు కూడా చేర్చాడు. అయితే తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ రన్నరప్‌గా నిలిచింది.
— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024
అయితే గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లిన కేన్ తుదిజట్టులో అవకాశం ;పొందలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడీ న్యూజిలాండ్ కెప్టెన్. పంజాబ్ కింగ్స్‌పై 26 పరుగులు, లక్నో సూపర్ జెయింట్స్‌పై ఒక్క పరుగే సాధించాడు. దీంతో కేన్ మామ మళ్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Rain played spoilsport last night but you showed up as always, #OrangeArmy 🧡🫶 pic.twitter.com/Dg8ejxSgOT
— SunRisers Hyderabad (@SunRisers) May 17, 2024
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, జాతవేద్ సుబ్రమణియన్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, నితీష్ రెడ్డి, మార్కో జాన్సేన్, అబ్ రాహుల్ షర్కేన్, త్రిపాఠి, ఉపేంద్ర యాదవ్, ఐదాన్ మార్క్రామ్, హెన్రిక్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఆకాష్ మహరాజ్ సింగ్, వనిందు హసరంగా, ఉమ్రాన్ మాలిక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..