AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH Practice Match : ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే 282 రన్సా? ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం

SRH Practice Match : సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 42 బంతుల్లో 94 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఈషాన్ కిషన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో రైజర్స్ ఈసారి కప్పు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్‌కు గట్టి నమ్మకాన్ని ఇస్తున్నారు.

SRH Practice Match : ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే 282 రన్సా? ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం
Ipl 2026
Rakesh
|

Updated on: Mar 22, 2026 | 3:06 PM

Share

SRH Practice Match : ఐపీఎల్ 2026 రణరంగం మొదలవ్వడానికి ఇంకా కొద్దిరోజులే సమయం ఉంది. మార్చి 28న గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తమ సొంత గడ్డపై ప్రాక్టీస్ మ్యాచులతో హోరెత్తిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఇంటర్నల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టించారు. SRH-A, SRH-B జట్ల మధ్య జరిగిన ఈ పోరులో బౌలర్లకు చుక్కలు కనిపించాయి. విధ్వంసకర బ్యాటింగ్ తో రైజర్స్ ఈసారి కప్పు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్‌కు గట్టి నమ్మకాన్ని ఇస్తున్నారు.

అభిషేక్ శర్మ విశ్వరూపం

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్-ఏ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు చేసి స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. దురదృష్టవశాత్తూ సెంచరీకి ఆరు పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. ఇతర బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (49), సలీల్ అరోరా (47) రాణించడంతో ఆ జట్టు 21 ఓవర్లలో 253 పరుగులు చేసింది. బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్ 5 వికెట్లతో మెరిశాడు.

ఎస్‌ఆర్‌హెచ్-బి జట్టు భారీ స్కోరు

మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్-బి జట్టు బ్యాటర్లు మరింత రెచ్చిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి ఏకంగా 282 పరుగులు చేసింది. కొత్తగా జట్టులోకి వచ్చిన ఈషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లోనే 72 పరుగులు చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు. సలీల్ అరోరా రెండు జట్ల తరపున బ్యాటింగ్ చేసి, ఈసారి 26 బంతుల్లో 56 రన్స్ బాదాడు. హర్ష దూబే చివర్లో 14 బంతుల్లో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీతో ఢీ

ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో సన్‌రైజర్స్ తలపడనుంది. అయితే సన్‌రైజర్స్ అభిమానులకు ఒక చిన్న చేదు వార్త ఏమిటంటే.. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంకా పూర్తి ఫిట్‌నెట్ సాధించకపోవడంతో మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఈషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈషాన్ కిషన్ సారథ్యంలోనే జార్ఖండ్ జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 గెలుచుకుంది, అదే మ్యాజిక్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌కు కూడా అందిస్తాడని యాజమాన్యం భావిస్తోంది.

ఆరెంజ్ ఆర్మీ ఈసారి వేరే లెవల్

గతేడాది ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ చేజార్చుకున్న సన్‌రైజర్స్, ఈసారి ప్రాక్టీస్ మ్యాచుల్లోనే 250కి పైగా స్కోర్లు సాధిస్తుండటం చూస్తుంటే ఇతర జట్లకు గట్టి హెచ్చరికలు పంపినట్లయింది. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ వంటి పవర్‌ఫుల్ హిట్టర్లతో పాటు ఈషాన్ కిషన్ తోడవ్వడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. మార్చి 28న బెంగళూరుతో జరగబోయే పోరులో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలని ఉప్పల్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం వడలు.. అల్సర్లు కూడా పరార్
ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం వడలు.. అల్సర్లు కూడా పరార్
కుక్కతో పాటు మార్నింగ్‌ వాక్‌కి వెళ్లిన మహిళ..వెంటాడిన వింత ఆకారం
కుక్కతో పాటు మార్నింగ్‌ వాక్‌కి వెళ్లిన మహిళ..వెంటాడిన వింత ఆకారం
తల్లిదండ్రులకు అలర్ట్! నిండు జీవితానికి రెండు చుక్కలు.. ఆదివారం..
తల్లిదండ్రులకు అలర్ట్! నిండు జీవితానికి రెండు చుక్కలు.. ఆదివారం..
ఐ మిస్ యూ.. ఐ లవ్ యూ.. అంటూ మెస్సెజ్ వస్తుందా..?
ఐ మిస్ యూ.. ఐ లవ్ యూ.. అంటూ మెస్సెజ్ వస్తుందా..?
ఆ సింగర్ దగ్గర మంచి టాలెంట్ ఉంది..
ఆ సింగర్ దగ్గర మంచి టాలెంట్ ఉంది..
ఈ రసం తాగితే ఇన్ని లాభాలా? తెలిస్తే అన్ని పక్కన పెడతారు
ఈ రసం తాగితే ఇన్ని లాభాలా? తెలిస్తే అన్ని పక్కన పెడతారు
ఒత్తైన నల్లని జుట్టు కోసం అప్పట్లో రాణులు పాటించిన చిట్కాలు ఇవే!
ఒత్తైన నల్లని జుట్టు కోసం అప్పట్లో రాణులు పాటించిన చిట్కాలు ఇవే!
చనిపోయేముందు సౌందర్య ఫోన్ చేసి ఇంటికి రమ్మంది..
చనిపోయేముందు సౌందర్య ఫోన్ చేసి ఇంటికి రమ్మంది..
ఉజ్జయిని మహాకాలేశ్వర ఆలయం.. దక్షిణాభిముఖ జ్యోతిర్లింగం వెనుక ఉన్న
ఉజ్జయిని మహాకాలేశ్వర ఆలయం.. దక్షిణాభిముఖ జ్యోతిర్లింగం వెనుక ఉన్న
నెలకు చిన్న మొత్తంతోనే కోటీశ్వరులు.. SIP మ్యాజిక్‌ ట్రిక్ తెలుసా?
నెలకు చిన్న మొత్తంతోనే కోటీశ్వరులు.. SIP మ్యాజిక్‌ ట్రిక్ తెలుసా?