
SRH Player Pat Cummins and Travis Head: ఐపీఎల్ 2025 మళ్ళీ ప్రారంభం కానుంది. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త కారణంగా, ఈ లీగ్‌ను బీసీసీఐ ఒక వారం పాటు నిలిపివేసింది. ఇప్పుడు మ్యాచ్‌లు మే 17 నుంచి జరనున్నాయి. ఐపీఎల్ తాజా షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది. అయితే, ఈ లీగ్ కోసం ఏ విదేశీ ఆటగాళ్ళు భారతదేశానికి తిరిగి వస్తారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. వాస్తవానికి, లీగ్ నిలిపివేసిన తర్వాత విదేశీ ఆటగాళ్ళు తమ దేశాలకు తిరిగి వెళ్లారు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాళ్ళు కూడా భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు.
IPL 2025 లో మిగిలిన మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ భారతదేశానికి తిరిగి రావొచ్చు. అదే సమయంలో, అతని సహచరుడు ట్రావిస్ హెడ్ కూడా మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఇద్దరు ఆటగాళ్లు జూన్ 11 నుంచి లార్డ్స్‌లో దక్షిణాఫ్రికాతో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడవలసి ఉంది. అయినప్పటికీ, ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు భారతదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నివేదికల ప్రకారం, SRH కెప్టెన్ కమ్మిన్స్, హెడ్ భారతదేశానికి తిరిగి వస్తారని ఫ్రాంచైజీకి తెలియజేశారు. “ఫ్రాంచైజీ కెప్టెన్‌గా పాట్‌కు ఒక బాధ్యత ఉంది. అతను తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాడు” అని కమిన్స్ మేనేజర్ నీల్ మాక్స్‌వెల్ మంగళవారం న్యూస్ కార్ప్‌తో అన్నారు.
ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కానీ, ఇప్పటికీ పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ మిగిలిన మ్యాచ్‌లలో భాగం కావాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. క్రికెట్ ఆస్ట్రేలియా అధిపతి బెన్ ఆలివర్ మాట్లాడుతూ, భారతదేశానికి తిరిగి రావాలా వద్దా అనే దానిపై ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయంపై బోర్డు రాబోయే రెండు రోజుల్లో వారితో కలిసి పని చేస్తుందని చెప్పుకొచ్చాడు.
పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్ కాకుండా, SRH మిగిలిన విదేశీ ఆటగాళ్ళు – హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ మలింగ, కమిండు మెండిస్, వియాన్ ముల్డర్ కూడా వారి వారి దేశాలకు తిరిగి వచ్చారు. ఇటువంటి పరిస్థితిలో, అతను భారతదేశానికి తిరిగి వస్తాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భాగమైన ఆటగాళ్లలో వియాన్ ముల్డర్ కూడా ఒకడు. అతను దక్షిణాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..