10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు.. ధనాధన్ బ్యాటింగ్‌తో బీభత్సం.. ఆ ప్లేయర్ ఎవరంటే?

|

Aug 04, 2022 | 1:49 PM

IRE vs SA 1st T20I: ఐర్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆఫ్రికన్ జట్టు 21 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు.. ధనాధన్ బ్యాటింగ్‌తో బీభత్సం.. ఆ ప్లేయర్ ఎవరంటే?
R Hendricks
Follow us on

IRE vs SA 1st T20I: బ్రిస్టల్‌లో దక్షిణాఫ్రికా వర్సెస్ ఆతిథ్య ఐర్లాండ్ మధ్య జరిగిన T20I సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఆఫ్రికన్ జట్టు 21 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు ఐర్లాండ్‌పై 211 పరుగుల భారీ స్కోరు చేసింది. దానికి సమాధానంగా ఐర్లాండ్ 190 పరుగులు చేసి బాగానే ప్రయత్నించింది. కానీ చివరికి ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా తరపున రీజా హెండ్రిక్స్ 53 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 74 పరుగులు చేయడంతో, సౌతాఫ్రికా భారీ స్కో్ర్ చేసింది. ఇది కాకుండా, ఐడెన్ మార్క్రామ్ 27 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 56 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ కూడా 11 బంతుల్లో 24 పరుగులు, ప్రిటోరియస్ 7 బంతుల్లో అజేయంగా 21 పరుగులు చేశాడు.

హెండ్రిక్స్ మూడో వికెట్‌కు మార్క్రామ్‌తో కలిసి 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. స్పిన్ బౌలర్ గారెత్ డెలానీ 16వ ఓవర్లో హెండ్రిక్స్, మార్క్రామ్‌లను వరుస బంతుల్లో అవుట్ అయ్యారు. దీంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

దీంతో ఐర్లాండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆ జట్టులో మూడో నంబర్ బ్యాట్స్‌మెన్ లోర్కాన్ టక్కర్ 38 బంతుల్లో 78 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడగా, జార్జ్ డాక్రెల్ 43 పరుగులు చేశాడు. అయితే, 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సమయంలో కేశవ్ మహరాజ్, వేన్ పార్నెల్, తబ్రేజ్ షమ్సీ తలో 2 వికెట్లు తీయగా, లుంగి ఎన్గిడి, డ్వేన్ ప్రిటోరియస్ చెరో వికెట్ తీశారు.